Keerthy Suresh interview about Bhola Shankar: వరుస సినిమాలతో దూసుకుపోతున్న కీర్తి సురేష్ మెగాస్టార్ చిరంజీవి చెల్లెలు పాత్రలో నటిస్తోంది. మెహర్ రమేష్ డైరెక్షన్లో తమన్నా హీరోయిన్ గా తెరకెక్కుతున్న భోళా శంకర్ సినిమాలో ఆమె ఆయన చెల్లెలుగా నటిస్తోంది. మరికొద్ది రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా కీర్తి తెలుగు మీడియా ప్రతినిధులతో ముచ్చటించింది. ఇక ఈ క్రమంలో చిరంజీవి సిస్టర్ క్యారెక్టర్ అనగానే డాన్స్ చేసే అవకాశం ఉందేమో అని భయపడ్డారా ? అని అడిగితే అవును ముందు అలాగే భయపడ్డాను, కానీ ఇందులో నా క్యారెక్టర్ కి ఆ స్కోప్ ఉందని, అన్నయ్యతో చాలా బబ్లీ, జాలీగా వుండే క్యారెక్టర్ కాబట్టి అది సూపర్ గా కుదిరిందని చెప్పుకొచ్చారు. ఇది బ్రదర్ సిస్టర్ స్టోరీ, బ్రదర్ సిస్టర్ ఎమోషన్ తో పాటు అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో పక్కా ప్యాకేజీగా ఉంటుందని అన్నారు.
Santosh Sobhan: డైరెక్టర్ అవుతాడని అనుకోలే.. కానీ ఇప్పుడు ఓ బ్రాండ్ అవుతాడని నమ్మకం
నాకు రియల్ లైఫ్ లో సిస్టర్ వుంది, కానీ బ్రదర్ లాంటి ఫ్రెండ్స్ చాలా మంది వున్నారని పేర్కొన్న ఆమె ఈ సినిమాతో చిరంజీవిగారితో నాకు మంచి ఫ్రెండ్షిప్ వచ్చేసిందని అన్నారు. మా అమ్మగారు 80s గ్రూప్ లో చిరంజీవి గారి ఫ్రెండ్. ఇప్పుడు నేను కొత్త ఫ్రెండ్ అని అన్నారు. చిరంజీవి గారు సెట్ లో చాలా విలువైన సూచనలు ఇచ్చారు, ఇలా చేస్తే బాగుంటుందని చెప్పేవారు, రోజు చిరంజీవి గారి ఇంటి నుంచి భోజనం వచ్చేసేదని అన్నారు.. నాకు ఫలానాది కావాలని అడిగి మరీ తెప్పించుకునే దాన్నని ఫుడ్ అనేది మా మధ్య మెయిన్ టాపిక్ అయిపోయిందని అన్నారు. ఉలవచారు,కాకరకాయ తెగ నచ్చాయని పేర్కొన్న ఆమె ప్రతి రోజు ఇంటి నుంచి ఏం వస్తుందో మెనూ చెప్పేవారని అన్నారు. నాయకుడుతో హిట్ కొట్టారు.. ఇప్పుడు భోళాతో హ్యాట్రిక్ కొడతారని భావిస్తున్నారా? అని అంటే అది హిట్ కొట్టిన తర్వాత చెప్తానని అన్నారు. అది నాకు మైండ్ లో వుందని పేర్కొన్న ఆమె ఆగస్టు 11 కోసం వెయిటింగ్ అని, హిట్టు కొట్టాక ముందు దాని గురించే మాట్లాడతానని అన్నారు.
