Site icon NTV Telugu

Keerthi Suresh : మరోసారి అలాంటి సినిమాలు చేయబోతున్న కీర్తి…?

Whatsapp Image 2023 06 14 At 11.34.22 Am

Whatsapp Image 2023 06 14 At 11.34.22 Am

తెలుగు లో హీరోయిన్స్ లో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకుంది కీర్తిసురేష్. ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా నటించిన నేను శైలజ సినిమా తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది క్యూట్ భామ కీర్తి.ఆ తర్వాత మహానటి సినిమా తో తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయింది. ఇక మహానటి సినిమా తో నేషనల్ అవార్డు ను కూడా అందుకుంది ఈ చిన్నది. ఆతర్వాత వరుసగా సినిమా లు చేస్తూ దూసుకెళ్తుంది ఈ భామ. మహేష్ బాబు మరియు పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది ఈ భామ. తెలుగు మరియు తమిళ్ భాషల్లో లు చేస్తోన్న కీర్తి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో కూడా ఆమె మెప్పించింది. కరోనా లాక్ డౌన్ సమయంలో ఈ భామ లేడీ ఓరియెంటెడ్ తో ఓటీటీలలో తెగ సందడి చేసింది.కీర్తికి లేడీ ఓరియెంటెడ్ సినిమా లు అంతగా కలిసి రాలేదు.

ఈ అమ్మడు చేసిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ప్రేక్షకులను అస్సలు ఆకట్టుకోలేదు.. పెంగ్విన్, మిస్ ఇండియా మరియు గుడ్ లక్ సఖి ఈ మూడు లు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయాయి. ఇదిలా ఉంటే ఇప్పుడు మరోసారి లేడీ ఓరియెంటెడ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుందని సమాచారం.దిల్ రాజు బ్యానర్ లో కీర్తిసురేష్ లేడీ ఓరియెంటెడ్ చేయనుందని సమాచారం.. నూతన దర్శకుడు ఈ సినిమా కు దర్శకత్వం చేయనున్నారని తెలుస్తోంది. ఆగస్టు లో ఈ మూవీ షూటింగ్ మొదలు పెట్టనున్నారని సమాచారం.. రీసెంట్ గా నాని నటించిన దసరా తో భారీ హిట్ అందుకుంది కీర్తి.అలాగే మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న భోళాశంకర్ సినిమా లో కూడా నటిస్తుంది. ఈ సినిమా లో చిరు చెల్లెలు పాత్రలో కనిపించనుంది కీర్తి. ఈ సినిమా షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతోంది.ఈ సినిమా కూడా కీర్తికి మంచి పేరు తెచ్చిపెడుతుందో లేదో చూడాలి.

Exit mobile version