Keeravani to Score Music for state song Jaya Jaya He Telangana: కొన్నాళ్ల క్రితం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంత్రివర్గ సమావేశంలో ‘జయ జయహే తెలంగాణ’ పాటను తెలంగాణ రాష్ట్ర గీతంగా అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే.. ఈ పాటను ప్రముఖ కవి అందెశ్రీ రాశారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడక ముందే ఈ పాట రాయగా తెలంగాణ రెండో ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర గీతంగా ఎంపిక చేశారు. ఈ పాట రాసిన అందెశ్రీ చదువుకోలేదు. ఆయన జనగామ జిల్లా రేవర్తికి చెందిన నిరుపేద కుటుంబంలో జన్మించారు. పశువుల కాపరిగా తాపీ మేస్త్రీగా పనిచేశారు. కవిత్వం ఆయనకు సహజంగానే వచ్చింది, రాయడం నేర్చుకుని విద్యావంతుడయ్యాడు.
Pavitra – Chandu: ‘పవిత్ర’ ప్రేమనుకోవాలా..? వ్యామోహమనుకోవాలా?
డిగ్రీ లేదు కానీ అనేక విశ్వవిద్యాలయాల నుండి డాక్టరేట్లు పొందారు అందెశ్రీ. అందెశ్రీ నదులపై కవిత్వం రాస్తూ ప్రపంచమంతా తిరిగాడు. మిస్సిస్సిప్పి, మిస్సోరీ, అమెజాన్, నైల్ లాంటి మహానదుల వెంట ప్రయాణిస్తూ నదులపై పెద్ద కవిత రాసే పనిలో పడ్డారు. ‘నిప్పుల వాగు’ పేరుతో వెయ్యేళ్ల నాటి తెలంగాణ పాటను కూడా ఆయన రికార్డు చేశారు. ఇక ఇప్పుడు అందెశ్రీ రాసిన పాటకు ఆస్కార్ అవార్డు గ్రహీత, ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీతం అందించనున్నారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఒక పాటను రికార్డు చేయనున్నారు. ఇక అందుకోసం సీఎం రేవంత్ తో మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి భేటీ అయ్యారు. జయ జయహే తెలంగాణ పాట కోసం సీఎంతో కీరవాణి భేటీ అయ్యారు. రాష్ట్ర గీతం కీరవాణితో పాడించేందుకు భేటీ జరుగగా ఈ భేటీలో రచయిత అందెశ్రీ కూడా ఉన్నారు. ఇక పాట పాడి సంగీతం అందించేందుకు కీరవాణి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపినట్టు తెలుస్తోంది.