Site icon NTV Telugu

ADDANKI DAYAKAR : కాంగ్రెస్ నాయకుని సినిమాకు కీరవాణి సంగీతం, గద్దర్ గానం!!

Gaddar

Gaddar

కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు అద్దంకి దయాకర్ హీరోగా మారారు. బొమ్మకు క్రియేషన్స్ పతాకంపై నిర్మితమౌతున్న ప్రొడక్షన్ నంబర్ 6లో ఆయన కథానాయకుడిగా నటిస్తున్నారు. డాక్టర్ మురళి బొమ్మకు స్వీయ దర్శకత్వంలో కథ, స్క్రీన్ ప్లే సమకూర్చుతూ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రముఖ సంగీత దర్శకులు ఎం. ఎం. కీరవాణి ఈ చిత్రానికి స్వర రచన చేస్తుండటం విశేషం. ప్రజా యుద్థనౌక గద్దర్ ఈ సినిమా కోసం రాసి, పాడిన ‘బానిసలారా లెండిరా’ అనే గీతాన్ని బోడుప్పల్ లోని బొమ్మకు ఫిల్మ్ స్టూడియోలో ఆవిష్కరించారు. ఈ ఆడియో వేడుకలో గద్దర్, అద్దంకి దయాకర్, దర్శకనిర్మాత, స్టూడియో అధినేత మురళి బొమ్మకు, రాజకీయ ప్రముఖులు జె. బి.రాజు, మల్లు రవి, మన్వతా రాయ్, బెల్లయ్య నాయక్, చరణ్ కౌశిక్ యాదవ్, శివకుమార్, దుర్గం భాస్కర్, విజయ్ కుమార్, భాస్కర్ రెడ్డి, రమేష్ రాథోడ్, కేతురి వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. సుమన్, ఇంద్రజ, సితార, హిమజ, సహస్ర, ‘శుభలేఖ’ సుధాకర్, మకరంద్ దేశ్ పాండే, రవి ప్రకాష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో గద్దర్ కూడా ఓ ప్రముఖ పాత్రను చేస్తున్నారు

Exit mobile version