Site icon NTV Telugu

Minister Srinivas Goud: ‘కేసీఆర్’ దేశ్ కి నేత అవుతారు…

Kcr

Kcr

ఫిబ్రవరి 17న 69 ఏట అడుగుపెడుతున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం వేడుకలకి రాష్ట్రం అంతా సిద్ధమవుతుంది. ఈ సంధర్భంగా కేసీఆర్ పుట్టిన రోజుని పురస్కరించుకుని తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు ప్రతాని రామకృష్ణ గౌడ్ ఒక స్పెషల్ సాంగ్ ని రూపొందించారు. ‘దేశ్ కి నేత’ అంటూ సాగే ఈ పాటని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు. ఈ పాటని లాంచ్ చేసిన తర్వాత శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ “దేశ్ కి నేత కేసీఆర్ పేరుతో ఈ పాటను రూపొంచినట్టు నిజంగానే కేసీఆర్ దేశ్ కి నేత” అని మంత్రి ఈ సందర్బంగా అన్నారు. ఈ పాటలో చెప్పింది అక్షరాలా నిజం కాబోతోందని, కేసీఆర్ దేశాన్ని ముందుకు నడిపించే నాయకుడని అని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా కేసీఆర్ పుట్టిన రోజు సెలబ్రేషన్స్ కి ఆయన పిలుపునిచ్చారు. ప్రముఖ దర్శకుడు సముద్ర, గౌడ సంఘం అధ్యక్షుడు లక్ష్మణ్ గౌడ్ ఈ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Exit mobile version