Site icon NTV Telugu

Ustaad: శ్రీసింహా కోడూరి సరసన కావ్య కళ్యాణ్ రామ్!

Ustad

Ustad

Kavya Kalyan Ram opposite Srisimha Koduri!

‘గంగోత్రి’, ‘బాలు’తో పాటు పలు చిత్రాలలో బాలనటిగా అలరించిన కావ్య కళ్యాణ్ రామ్ ఇప్పుడు హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ తేనెకళ్ళ సోగయంకు సంబంధించిన కొన్ని గ్లామర్ స్టిల్స్ సోషల్ మీడియాలో కొంతకాలంగా చక్కర్లు కొడుతున్నాయి. బహుశా హీరోయిన్ ఛాన్స్ కోసమే కావ్య ఆ పని చేసి ఉండొచ్చు. ఇప్పుడు అదృష్టం ఆమె తలుపును ‘ఉస్తాద్’ రూపంలో తట్టింది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి తనయుడు శ్రీసింహా ‘మత్తు వదలారా’ చిత్రంతో హీరో అయ్యాడు. ఆ తర్వాత ‘తెల్లవారితే గురువారం’ మూవీలో నటించాడు. ప్రస్తుతం ‘దొంగలున్నారు జాగ్రత్త’తో పాటు ‘ఉస్తాద్’ అనే మూవీలోనూ నటిస్తున్నాడు. ఈ ‘ఉస్తాద్’ సరసన నాయికగా కావ్య కళ్యాణ్ రామ్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారు. ఇవాళ ఆమె బర్త్ డే సందర్భంగా ఈ విషయాన్ని రివీల్ చేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ తో శుభాకాంక్షలు తెలిపింది చిత్రబృందం. ఫణిదీప్ దర్శకత్వంలో రజనీ కొర్రపాటి, రాకేశ్ రెడ్డి గడ్డం, హిమాంక్ రెడ్డి దువ్వూరు ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Exit mobile version