Site icon NTV Telugu

Kona Venkat: కోన వెంకట్ నా మీద దాడి చేశాడు.. వ్యక్తి ఫిర్యాదు!

Kona Venkat

Kona Venkat

Kathi Rajesh Complains on Kona Venkat at Karlapalem Police Station: బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెం పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కర్లపాలెం మండలం గణపవరం కు చెందిన రాజేష్ అని ఓ వ్యక్తి పై వైసీపీకి చెందిన కీలక నాయకుడు బంధువు దాడి? చేశాడు అంటూ పెద్ద ఎత్తున వివాదం చెలరేగింది. తన పై సినీ రచయిత కోన వెంకట్ దాడి చేశాడంటూ పోలీస్ స్టేషన్లో రాజేష్ అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. తనపై పోలీసుల సమక్షంలోనే సినీ రచయిత కోన వెంకట్ దాడి చేశాడని, కత్తి రాజేష్ అనే వ్యక్తి ఆరోపిస్తున్నారు. దీంతో కర్లపాలెం పోలీస్ స్టేషన్ వద్దకు రాజేష్ కుటుంబ సభ్యులు, అనుచరులు చేరుకుంటున్నారు. నిజానికి టాలీవుడ్ సీనియర్ రైటర్, ప్రొడ్యూసర్ గా మారిన కోన వెంకట్ ఆంధ్రప్రదేశ్ అధికార పార్టీ వైఎస్సార్ కాంగ్రెస్‌ మద్దతుదారన్న సంగతి తెలిసిందే.

Allu Arjun: నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్ కి పోలీసుల షాక్.. కేసు నమోదు?

ఎందుకంటే ఆయన బాబాయ్ కోన రఘుపతి వైసీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు, ఇప్పుడు బాపట్లో బరిలో మళ్ళీ దిగారు. 2019 ఎన్నికల ముంగిట ఆయన కోసం వైసీపీలో చేరి ఎన్నికల ప్రచారం కూడా కోన వెంకట్ చేశారు. అంతేకాదు ఈ మధ్య కూడా కొన్ని సార్లు అక్కడికి వెళ్లి వచ్చారు, అలాగే సోషల్ మీడియాలో వైసీపీ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటూ ఉంటారు. నిజానికి కోన వెంకట్ వైసీపీకి మద్దతుగా ఉంటారని అందరికీ తెలుసు. ఆ పార్టీకి మద్దతుగా సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు కూడా. ఈ క్రమంలో ఈమధ్య ఎక్కువగా బాపట్లలో జరిగిన అభివృద్ధి గురించి ఆయన ట్వీట్లు చేస్తున్నారు. అయితే ఈ మధ్యకాలంలో ఆయన చేసిన ట్వీట్లు.. సోషల్ మీడియాలో ఆయనకు నెగటివ్ కామెంట్స్ కూడా తెచ్చిపెడుతున్నాయి.

Exit mobile version