అలనాటి హీరోయిన్ కస్తూరి శంకర్ గురించి పరిచయం అక్కర్లేదు. సినిమాలతో పాటు బుల్లితెర మీద కూడా తనదైన గుర్తింపు తెచ్చుకున్న ఈ అందగత్తె, తాజాగా మళ్లీ వార్తల్లోకి వచ్చారు. ప్రముఖ టాక్ షోలో గెస్ట్‌గా పాల్గొన్న కస్తూరి, తన జీవితంలోని కొన్ని వ్యక్తిగత, ఫన్నీ జ్ఞాపకాలను పంచుకున్నారు. అందులో ముఖ్యంగా హీరో నాగార్జునపై తన టీనేజ్ లవ్ స్టోరీ వెల్లడిస్తూ షాక్ ఇచ్చారు.
Also Read : Karuppu : సంక్రాంతి బరిలో నుంచి తప్పుకున్న కోలీవుడ్ స్టార్..!
“నేను చదువుకునే రోజుల్లోనే నాగార్జున గారంటే చాలా ఇష్టం. ఆ రోజుల్లో ఒకసారి ఆయనను కలిశాను. ఆయన వేసుకున్న షర్ట్ కలర్ నుంచి లుక్ వరకు ఇప్పటికీ గుర్తుంది. ఆయనతో షేక్‌హ్యాండ్ ఇచ్చుకున్న తర్వాత ఆ టచ్ చేసిన చేయి రెండు రోజులు కడగలేదు. ఫ్రెండ్స్‌కి చూపిస్తూ ‘ఇది నాగార్జున టచ్ చేసిన చేయి’ అని చెప్పేదాన్ని,” అని నవ్వుతూ గుర్తుచేశారు. తన మాటలు విన్న యాంకర్ కూడా ఆశ్చర్యపోయింది. దీంతో “ఇప్పుడు నాగార్జున గారిని చివరిసారి ఎప్పుడు కలిశారు?” అని అడగా. దానికి కస్తూరి నవ్వుతూ “చాలా రోజుల య్యాయి. ఒకసారి వెళ్లి కలవాలి అనిపిస్తుంది, ఏదైనా సాకుతో వెళ్లి కలవాలి కదా” అంటూ ఫన్నీగా సమాధానమిచ్చారు. తర్వాత నాగార్జున గురించి మాట్లాడుతూ..
“మా జనరేషన్‌లో ఆయన హీరో మాత్రమే కాదు, క్రష్ కూడా. ఇప్పుడు కూడా యూత్‌లో ఆయనకు అదే క్రేజ్. వయసుతో ఆయన యంగ్ లుక్, చార్మ్ ఏ మాత్రం తగ్గలేదు” అంటూ ప్రశంసలు కురిపించారు. మరి నాగార్జునతో రొమాంటిక్ సీన్ చేయమంటే? అన్న ప్రశ్నకు కస్తూరి నవ్వుతూ “అది బెస్ట్ థింగ్. అలాంటి అవకాశం వస్తే వదులుకుంటారా? నాగార్జున చాలా ప్రొఫెషనల్, జెంటిల్మెన్. ఆయనతో నటించడం ఏ హీరోయిన్‌కైనా కంఫర్ట్. నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటాను” అని సమాధానం ఇచ్చారు. ఇప్పుడు ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అభిమానులు “నాగ్ మ్యాజిక్ ఎప్పటికీ తగ్గదు”, “కస్తూరి గారి ఫ్యాన్ లవ్ నిజంగా హార్ట్ టచింగ్” అంటూ కామెంట్లు చేస్తున్నారు.
