Site icon NTV Telugu

Kasthuri Arrest: నటి కస్తూరి అరెస్ట్!

Kasturi Arrest

Kasturi Arrest

గత కొంతకాలంగా పరారీలో ఉన్న నటి కస్తూరిని హైదరాబాద్ లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె కొద్ది రోజుల క్రితం చెన్నైలో జరిగిన ఒక కార్యక్రమంలో తెలుగువారి గురించి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆమె మీద చెన్నై వ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాల వారు అనేక కేసులు పెట్టారు. పోలీసులు ఈ అంశం మీద కేసులు కూడా నమోదు చేశారు. అయితే అప్పటి నుంచి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఆమె ఇంటికి కూడా రాకుండా పోలీసులు అందుబాటులోకి రాకుండా పరారీలో ఉన్నారు. అయితే కస్తూరి హైదరాబాదులో ఉన్న విషయం తెలుసుకున్న చెన్నై పోలీసులు హైదరాబాద్ వచ్చారు.

Darshan Fans: నటుడిపై దర్శన్ అభిమానుల దాడి? ఎందుకంటే?

నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆమెను అరెస్ట్ చేశారు. నార్సింగ్ పోలీసుల సహకారంతో సినిమా నటి కస్తూరిని అదుపులోకి తీసుకున్నారు చెన్నై పోలీసులు. పుప్పాల గూడలోని BRC అపార్ట్ మెంట్ లోని ఓ ఫ్లాట్ లో కస్తూరి ఉందన్న సమాచారం తెలుసుకున్న చెన్నై పోలీసులు హైదరాబాదు పోలీసులకు సమాచారం ఇచ్చి వారి సహకారంతో అరెస్ట్ చేశారు. గచ్చిబౌలి లో ఉన్న ఆమెను అరెస్ట్ చేసి చెన్నై తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగువారు చెన్నైలో ఉన్న రాజుల అంతపురం లో పని చేసేందుకు వచ్చారు అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే తాను అన్న వ్యాఖ్యలను వక్రీకరించారని తాను ఆ ఉద్దేశంతో అనలేదని ఆమె కవర్ చేసే ప్రయత్నం చేశారు. అంతేకాక తనను అరెస్ట్ చేయకుండా చూడాలంటూ ముందస్తు బెయిల్ కి కూడా ఆమె అప్లై చేశారు. అయితే ఈ విషయం మీద కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఇది ఇలా జరుగుతుండగానే పోలీసులు ఆమెను అరెస్ట్ చేయడం గమనార్హం.

Exit mobile version