Site icon NTV Telugu

HIT 4 : ఇట్స్ అఫీషియల్.. హిట్4 లో కార్తి పోస్టర్ రిలీజ్..

Hit4

Hit4

HIT 4 : హిట్ ప్రాంచైజీలో ఇప్పటికే మూడు పార్టులు వచ్చేశాయి. నాని నటించిన థర్డ్ పార్ట్ రీసెంట్ గా వచ్చి మంచి హిట్ అయింది. అందులోనే నాలుగో పార్టుకు సంబంధించిన అప్డేట్ కూడా ఇచ్చేశారు. అందులో కార్తీ నటిస్తారని అప్పుడు జస్ట్ హింట్ మాత్రమే ఇచ్చారు. వీరప్పన్ గా అందులో కనిపించాడు కార్తీ. మూడో పార్టులో చివర్లో సీఎస్కే, ఎస్ ఆర్ హెచ్ మ్యాచ్ చూస్తూ చెన్నై అభిమానిగా కనిపించారు. అయితే ఆ విషయాన్ని తాజాగా అధికారికంగా ప్రకటించారు మూవీ టీమ్.

Read Also : Madhya Pradesh: మరో నిర్భయ.. గిరిజన మహిళపై దారుణం..

ఈ రోజు కార్తీ పుట్టిన రోజు సందర్భంగా హిట్4 నుంచి కార్తీ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఈ మూవీని హిట్ ప్రాంచైజీ డైరెక్టర్ శైలేష్ కొలను డైరెక్ట్ చేయబోతున్నారు. చూస్తుంటే వచ్చే ఏడాది ఈ సినిమా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ ఏడాదిలోనే షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా పోస్టర్ లో ఏసీపీ వీరప్పన్ అంటూ కార్తీని పరిచయం చేశారు. ఇందులో మీసం తిప్పుతూ కనిపించారు కార్తీ. ఇందుకు సంబంధించిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Read Also : Kamal Hasan : కమల్ కోసం గొడవ పడ్డాను.. శివరాజ్ కుమార్ ఇంటరెస్టింగ్ కామెంట్స్..

Exit mobile version