బాలీవుడ్ ఫ్యూచర్ సూపర్ స్టార్ అనే పేరు తెచ్చుకున్న యంగ్ హీరో ‘కార్తీక్ ఆర్యన్’. యాక్టింగ్ టాలెంట్ పుష్కలంగా ఉన్న ఈ హీరోకి నార్త్ లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి స్టార్ హీరోగా పేరు తెచ్చుకుంటున్న కార్తీక్ ఆర్యన్, రీసెంట్ గా ‘షెహజాదా’ సినిమాతో ప్రేక్షకులని డిజప్పాయింట్ చేశాడు. అల వైకుంఠపురములో సినిమాకి రీమేక్ గా వచ్చిన ఈ మూవీ హిందీలో బాక్సాఫీస్ దగ్గర చతికిల పడింది. దీంతో కార్తీక్ ఆర్యన్ మార్కెట్ కి చిన్న డెంట్ పడింది. ఈ ఫ్లాప్ మరక నుంచి బయట పడాలి అంటే కార్తీక్ ఆర్యన్ కి ఇమ్మిడియేట్ గా హిట్ కొట్టాలి. అందుకే 2022లో తనకి సూపర్ హిట్ ఇచ్చిన హారర్ జోనర్ నే నమ్మి ‘భూల్ భులయ్య ‘ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేశాడు.
2024 దివాళీకి భుల్ భులయ్య 3 సినిమా రిలీజ్ కాబోతుంది అంటూ అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకి వచ్చేసింది. సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన ‘చంద్రముఖి’ సినిమాకి రీమేక్ వర్షన్ గా హిందీలో ‘భుల్ భులయ్య’ సినిమా తెరకెక్కింది. అక్షయ్ కుమార్ హీరోగా నటించిన ఈ మూవీ నార్త్ లో సూపర్ హిట్ అయ్యింది. అయితే 2022లో రిలీజ్ అయిన పార్ట్ 2లో మాత్రం అక్షయ్ కుమార్ ప్లేస్ లో కార్తీక్ ఆర్యన్ వచ్చాడు. ఇప్పుడు పార్ట్ 3లో కూడా కార్తిక్ ఆర్యన్ కంటిన్యు అవుతున్నాడు. భుల్ భులయ్య అనే టైటిల్ ని మాత్రం అలానే ఉంది, ప్రతి సీక్వెల్ లో కొత్త కథతో సినిమా చేస్తున్నారు. ఈ పార్ట్ 3 కూడా హిట్ అయితే భుల్ భులయ్య ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హారర్ ఫ్రాంచైజ్ అయ్యే ఛాన్స్ ఉంది.
#RoohBaba Returns Diwali 2024 🙏🏻#BhoolBhulaiyaa3 🤙🏻💥 pic.twitter.com/JxtTZS0DDZ
— Kartik Aaryan (@TheAaryanKartik) March 1, 2023
