తమిళ హీరో కార్తీ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజిగా ఉన్నాడు. డిఫ్రెంట్ కథలతో సినిమాలు చేస్తూ తనకంటూ సెపరేట్ గుర్తింపు తెచ్చుకున్నాడు. అటు తమిళ్ తో పాటు ఇటు తెలుగులోను కార్తీ సినిమాలకు మంచి డిమాండ్ ఉంది. కార్తీ నటించిన యుగానికి ఒక్కడు, ఖైదీ, ఊపిరి, ఆవారా, ఖాకి, సర్దార్ వంటి సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచాయి. కార్తీ సినిమా అంటే మినిమం గ్యారెంటీ అనే అభిప్రాయం సినిమా ప్రేక్షకుల్లో ఉంది.
Also Read : Megastar : విశ్వంభర ఆటకావాలా.. పాటకావాలా..?
ప్రస్తుతం సర్దార్ కు సీక్వేల్ సర్దార్ 2 తో పాటు మరో సూపర్ హిట్ ఖైదీ కి సీక్వెల్ ఖైది 2లో నటిస్తున్నాడు కార్తీ. ఇక ఇప్పుడు మరో సినిమా చేస్తున్నాడు. కార్తీ కెరీర్ లో 29వ సినిమాగా వస్తున్న ఈ సినిమాకు ‘మార్షల్’ అనే టైటిల్ ను ఫిక్స్ చేస్తూ అఫీషియల్ పోస్టర్ ను రిలీజ్ చేసారు మేకర్స్. నేడు చెన్నైలో పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ సినిమాకు కోలీవుడ్ సూపర్ హిట్ సినిమా తనక్కారన్ డైరెక్ట్ చేసిన యంగ్ దర్శకుడు ‘తమిళ’ దర్శకత్వం వహిస్తున్నాడు. యంగ్ సెన్సషన్ సాయి ఆభ్యంకర్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా భారీ బడ్జెట్‌తో నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా కథ రామేశ్వరం నేపథ్యంలో సాగుతుండడం మెజారిటి పోర్షన్ సముద్రం లొకేషన్స్ షూట్ చేయాల్సి ఉందట. అత్యంత భారీ బడ్జెట్ పై తెరకెక్కుతున్న మార్షల్ సినిమాను డ్రీమ్ వారియర్ పిచర్స్ బ్యానర్ పై ప్రకాష్ బాబు, ఎస్ ఆర్ ప్రభు నిర్మిస్తున్నారు.
