కార్తీ నటించిన ఆవారా, ఖాకీ, ఖైదీ లాంటి సినిమాలు తెలుగులోనూ మంచి విజయం సాధించాయి. కార్తీ తెలుగులోనూ స్ట్రయిట్ సినిమా చేశారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఊపిరి సినిమాతో తెలుగులో నటించారు. కార్తీ తాజాగా నటించిన మణిరత్నం మూవీ పొన్నియన్ సెల్వన్ సినిమాకు తెలుగు, తమిళ్ భాషల్లో మంచి రెస్పాన్స్ కనిపిస్తోంది. ఇక ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయ్యాడు. అభిమన్యుడు ఫేమ్ దర్శకుడు పిఎస్ మిత్రన్ కాంబినేషన్ లో వస్తోన్న సినిమా సర్దార్.. ఈ చిత్రానికి సంబంధించి విడుదలైన టీజర్‌లు, ఫస్ట్‌లుక్‌లో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాయని చెప్పాలి. ఈసినిమా అక్టోబర్ 21 శుక్రవారం తెలుగుతోపాటు, తమిళంలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ బుధవారం గ్రాండ్ గా నిర్వహించారు. ఈ ఈవెంట్ కు నాగార్జున స్పెషల్ గెస్ట్ గా వచ్చారు.
కార్తీ కి పాటలంటే ఇష్టం.. పాటలు పాడడం కూడా ఇష్టమే అని నిరూపించాడు. చిన్నప్పటి నుంచి ఎంతోమంది అమ్మాయిల కోసం పాటలు పాడేవాడినన్నారు కార్తీ. సర్దార్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కార్తీ సందడి చేశారు. అభిమానుల కోరిక మేరకు ఆయన నాగార్జున హిట్ మూవీ సాంగ్ ‘కన్నుల్లో నీ రూపమే…) పాడి వినిపించారు. సర్దార్ మూవీ ఈవెంట్ లో ఈ సాంగ్ హైలైట్ గా నిలిచింది. యుగానికొక్కడు డైలాగ్.. ఎవర్రా మీరంతా.. వాడి అందరినీ అలరించారు. ఇంత ప్రేమ చూపిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నా అన్నారు కార్తీ. కార్తీ పాడిన సాంగ్ ని నాగార్జున కూడా బాగా ఎంజాయ్ చేశారు.