NTV Telugu Site icon

Karthi: అది నా అన్న.. సూర్యపై కార్తీ ఎమోషనల్ పోస్ట్

Suria Karthi

Suria Karthi

Karthi: కోలీవుడ్ స్టార్ హీరోలు, అన్నదమ్ములు సూర్య- కార్తీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇద్దరు తమ తమ నటనతో టాలీవుడ్ లో ఒక మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఈ అన్నదమ్ములు బిజీగా మారారు. ఇక ఇంటితో సూర్య ఫిల్మ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి 25 ఏళ్లు పూర్తిచేసుకున్న విషయం విదితమే. దీంతో అభిమానులు సూర్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ట్విట్టర్ లో ట్రెండ్ చేస్తున్నారు.ఇక తాజాగా అన్న ప్రస్థానాన్ని తలుచుకొని కార్తీ ఎమోషనల్ అయ్యాడు. తన అన్న గురించి ఎంతో గర్వంగా చెప్పుకొచ్చాడు.

“అతను తన ప్రతి మైనస్‌ను తన గొప్ప ప్లస్‌గా మార్చుకోవడానికి పగలు మరియు రాత్రి పనిచేశాడు. అతను తన స్వంత విజయాలను అధిగమించడంపై మాత్రమే దృష్టి పెట్టాడు. ఒక వ్యక్తిగా, అతను ఇప్పటికే ఉదారంగా ఉన్న తన హృదయాన్ని మరింత పెద్దదిగా చేశాడు. అర్హులైన వేలాది మంది పిల్లల జీవితాలను తీర్చిదిద్దాడు. అది నా అన్న సూర్య” అంటూ తమ చిన్నతి ఫోటోను షేర్ చేశాడు. ఇక తమ్ముడు ట్వీట్ కు సూర్య తనదైన శైలిలో రిప్లై ఇచ్చాడు. “రండి.. అన్న దయచేసి పాడుతూ ఉండు” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే వీరిద్దరి మధ్య బాండింగ్ చూసి అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అన్నాతమ్ముళ్లు అంటే ఇలా ఉండాలి. అన్న ఎదుగుదలను తమ్ముడు గర్వంగా చెప్పుకుంటున్నాడు అంటూ కార్తీని ప్రశంసిస్తున్నారు.

Show comments