Karthi30: ‘మార్షల్’ కంటే ముందే ‘కార్తి30’ పూర్తి?.. షూటింగ్ షెడ్యూల్‌పై ఇంట్రెస్టింగ్ అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Karthi30: తమిళ స్టార్ హీరో కార్తి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన చేతిలో ‘సర్దార్ 2’, ‘మార్షల్’, అలాగే ‘కార్తి30’ పేరుతో రూపొందుతున్న సినిమా కూడా ఉంది. ఈ నేపథ్యంలో కార్తి షూటింగ్ షెడ్యూల్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. పీరియడ్ డ్రామా ‘మార్షల్’ పూర్తికాకముందే, ‘కార్తి30’ షూటింగ్‌ను పూర్తి చేసే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.
ముందుగా ‘కార్తి30’కి గ్రీన్ సిగ్నల్?
ప్రస్తుతం కార్తి, ‘మ్యాడ్’ ఫేమ్ దర్శకుడు కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం ‘కార్తి30’ షూటింగ్లో పాల్గొంటున్నట్లు సమాచారం. ఈ సినిమా షూటింగ్‌కు ఇంకా దాదాపు 20 రోజుల మాత్రమే మిగిలి ఉందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్ పూర్తైన వెంటనే కార్తి తిరిగి ‘మార్షల్’ షూటింగ్లో జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయాలపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు.
Also Read
- Scene Movie: "హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది": సూర్య
- Dada: రక్తపాతం లేని రచ్చ.. బాలయ్య వర్సెస్ మనోజ్ ‘దాదా’ వార్!
- Sivakarthikeyan: డైరెక్టర్‌కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన హీరో.. సర్ప్రైజ్ మామూలుగా లేదుగా!
- Tollywood: ఒకే ఒక్క ఫ్లాప్.. ప్రశ్నార్థకంగా మారిన స్టార్ డైరెక్టర్ల భవిష్యత్తు!
‘మార్షల్’ ఒక పీరియాడిక్ కథ
‘తానక్కరన్’ ఫేమ్ దర్శకుడు తమిళ్ తెరకెక్కిస్తున్న ‘మార్షల్’ 1965 నేపథ్యంలో సాగే పీరియడ్ డ్రామాగా రూపొందుతోంది. ఈ సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ కథానాయికగా నటిస్తుండగా, ఆది పినిశెట్టి ప్రధాన ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. సమాచారం ప్రకారం, ‘మార్షల్’ షూటింగ్లో ఇంకా సుమారు 50 శాతం పని మిగిలి ఉన్నట్లు తెలుస్తోంది. పీరియడ్ బ్యాక్‌డ్రాప్‌లో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.
‘కార్తి30’లో మీనాక్షి చౌదరి
మరోవైపు ‘కార్తి30’లో కార్తికి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ‘మ్యాడ్’ దర్శకుడు కళ్యాణ్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండటంతో ఇది యూత్‌ఫుల్ ఎంటర్టైనర్గా ఉండొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా తమిళం, తెలుగులో ఒకేసారి రూపొందుతోంది.
ముందుగా ‘సర్దార్ 2’
ఇదిలా ఉంటే పి.ఎస్. మిథ్రాన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘సర్దార్ 2’ యాక్షన్ థ్రిల్లర్ 2026 సెప్టెంబర్ 10న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. 2022లో వచ్చిన ‘సర్దార్’ కి ఇది సీక్వెల్. ఇందులో కార్తి మరోసారి తండ్రీకొడుకుల ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. అలాగే ఎస్.జె. సూర్య ‘బ్లాక్ డాగర్’ అనే ప్రతినాయకుడి పాత్రలో నటిస్తుండటంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది. మొత్తానికి ‘సర్దార్ 2’ విడుదలకు సిద్ధమవుతుండగా, ఇప్పుడు ‘కార్తి30’ షూటింగ్‌ను ముందుగా పూర్తి చేసి, ఆ తర్వాత ‘మార్షల్’పై పూర్తి దృష్టి పెట్టనున్నట్లు తెలుస్తోంది. ఇక పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్ ‘మార్షల్’ 2026 దీపావళి కానుకగా భారీ ఎత్తున థియేటర్లలో విడుదల కాబోతుండగా, ‘మ్యాడ్’ ఫేమ్ కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న ‘కార్తీ 30’ (Karthi 30) 2027 జనవరిలో సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
తాజావార్తలు
-
Chairman’s Desk : కేంద్రం అనవసరంగా సర్‌ను వివాదం చేసుకుందా? ప్రతిపక్షాలు ఈ టెంపోను కొనసాగించగలవా?
-
Scene Movie: “హీరోలు చాలు.. ఒక విలన్ కావాలి! లోకేష్‌తో రోలెక్స్ ప్లాన్ నడుస్తోంది”: సూర్య
-
Diwali Lunch Menu Ideas : దీపావళి విందు స్పెషల్.. ఈ వెజ్ మెనూతో అదరగొట్టండి
-
OTR: తెలంగాణపై బీజేపీ మిషన్ స్టార్ట్.. అమిత్ షా సమరశంఖం
-
Off The Record: గులాబీ పార్టీలో కొత్త తలనొప్పులు.. మాజీ ఎమ్మెల్యేల సీట్లకే ఎసరు?
ట్రెండింగ్
-
రూ.10,999కే 50MP కెమెరా ఫోన్, 7000mAh బ్యాటరీతో Karbonn Rebel సిరీస్ లాంచ్..!
-
Women’s Cricket World Cup 2025: తొలిసారి విశ్వవిజేతగా నిలిచి ఏడాది.. ప్రపంచకప్‌తో చరిత్ర తిరగరాసిన భారత అమ్మాయిలు..!
-
ఆస్ట్రేలియాకు షాక్.. Hong Kong Sixes 2026 విజేతగా ఆఫ్ఘనిస్థాన్..!
-
మళ్లీ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి Karbonn.. Rebel సిరీస్‌లో రానున్న ఫోన్లు..!
-
9000mAh బ్యాటరీ, 50MP కెమెరా, 144Hz డిస్ప్లేతో OnePlus Turbo 6Vs స్మార్ట్‌ఫోన్ లాంచ్..!