NTV Telugu Site icon

‘Karimnagar’s Most Wanted: ‘ఆహా’లో ‘కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్’ సిరీస్.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్

Karimnagar's Most Wanted

Karimnagar's Most Wanted

‘Karimnagar’s Most Wanted to Stream in AHA Video: పొలిటికల్ క్రైమ్ డ్రామా వెబ్ సిరీస్ కరీంనగర్స్- మోస్ట్ వాంటెడ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. స్ట్రీట్ బీట్జ్ సినిమా నిర్మాణంలో బాలాజీ భువనగిరి దర్శకత్వం వహించిన ఈ వెబ్ సిరీస్ డిసెంబర్ 22న ఆహా ఓటీటీలో విడుదల అయ్యేందుకు రెడీ అయింది. ఇక ఇప్పటికే ఈ సిరీస్ ట్రైలర్, కరీంనగర్స్ వాలే పాట సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నాయి. ఇక కరీంనగర్ లోని నలుగురు సామాన్య కుర్రాళ్ళ జీవితాలని ఆసక్తికరంగా పరిచయం చేస్తూ మొదలైన ట్రైలర్, యాక్షన్ డ్రామా ఎమోషన్స్ తో ఆకట్టుకునేలా ఉంది. ఇక ట్రైలర్ లో అద్భుతమైన పెర్ఫార్మెన్స్ లు కనిపించగా నూతన నటులు అమన్ సూరేపల్లి, సాయి సూరేపల్లి, అనిరుధ్ తుకుంట్ల ఇలా అంతా కొత్త నటులైనా, తమ సహజత్వంతో మంచి నటన కనబరిచారు. సంకీర్త్ రాహుల్ కెమెరా వర్క్ బ్రిలియంట్ గా ఉండగా సాహిత్య సాగర్ సంగీతం, ఎస్.అనంత్ శ్రీకర్ నేపథ్య సంగీతం ఆకట్టుకున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి. ఇక ‘బలగం’ ఫేం రైటర్ రమేష్ ఎలిగేటి ఈ సిరీస్ కు పవర్ ఫుల్ కథా, కథనం, సంభాషణలు అందించారు.

Prema Vimanam: ZEE5 ఒరిజినల్ ‘ప్రేమ విమానం’కి అరుదైన గుర్తింపు

ఇక బలగం ఫ్యామిలీ డ్రామా అయితే దానికే పూర్తి భిన్నంగా పొలిటికల్ క్రైమ్ డ్రామా కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ అని చెబుతున్నారు. ట్రైలర్ లో వినిపించిన డైలాగ్స్ లో నటీనటులంతా కరీంనగర్ యాసని అద్భుతంగా పలికగా ఈ సిరీస్ లో దాదాపు అందరూ కొత్తనటీనటులే ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. 50 మంది రంగస్థల నటులని ఆడిషన్స్ ద్వారా ఎంపిక చేశారని, ఇందులో దాదాపు నటీనటులంతా కరీంనగర్ కు చెందిన వారే అని తెలుస్తోంది. ఈ సిరీస్ మొత్తం కరీంనగర్ లో షూట్ చేయగా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని, విజువల్ గా చాలా ఫ్రెష్ నెస్ ని తీసుకొస్తుంది. ఇప్పటికే ఈ సిరీస్ నుంచి విడుదలైన “కరీంనగర్ వాలే” పాట కూడా బాగా నోటెడ్ అయింది. ఆస్కార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ పాడిన ఈ పాట కొత్త యూట్యూబ్ ఛానల్ లో విడుదల చేసినప్పటికీ వారంలో మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసి సూపర్ హిట్ అయ్యింది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ తో కంప్లీట్ తెలంగాణ నేపథ్యంలో తొలి వెబ్ సిరీస్ గా రాబోతున్న కరీంనగర్స్ మోస్ట్ వాంటెడ్ ఖచ్చితంగా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచిందనే చెప్పాలి. ఇక డిసెంబర్ 22 నుంచి ఆహా ఓటీటీలో ఈ సిరీస్ ప్రసారం కానుంది.