Site icon NTV Telugu

Kareena kapoor : వామ్మో.. ఈ డ్రెస్స్ ఖరీదు అంతనా?

Kareena Kapoor

Kareena Kapoor

బాలివుడ్ బ్యూటీ కరీనా కపూర్ గురించి అందరికి తెలుసు.. ఒకప్పుడు బాలివుడ్ లో వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉండేది..పెళ్లి తర్వాత సినిమాలను తగ్గించిన ఈ అమ్మడు కుటుంబం పిల్లలతో బిజీగా ఉంటుంది.. ఇద్దరు పిల్లలకు తళ్ళైన కూడా చెక్కు చెదరని అందం ఈమె సొంతం..గ్లామర్ ప్రపంచంలో తన స్టైల్‌ను చాటుకుంటూనే ఉంటుంది. చాలా క్యాజువల్‌గా, ఎలాంటి మేకప్‌ లేకుండా కూడా తన స్టన్నింగ్‌ లుక్స్‌తో అభిమానులను మెస్మరైజ్ చేయడంలో వెనకడుగు వెయ్యదు.. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడు యాక్టివ్ గా ఉంటూ ఫోటోలను షేర్ చేస్తుంది..

తాజాగా సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు వైరల్ అవుతున్నాయి.. ఆ ఫొటోలో వేసుకున్న డ్రెస్సు ఖరీదు ఇప్పుడు ఇంటర్నెట్ ను షేక్ చేస్తుంది..బ్లాక్ కలర్స్ అండ్‌ ప్రింట్స్‌ ఇష్టపడే కరీనా ఇటీవలి ఔటింగ్‌లో సమ్మర్‌కు తగ్గినట్టు ప్రింటెడ్ ఓవర్‌సైజ్డ్ జిమ్మెర్‌మాన్ కో-ఆర్డ్ సెట్‌తో మెరిసింది. ఇలా స్పెషల్‌ లుక్‌లో అలరించిన కరీనా వేసుకున్న డ్రెస్‌ ఎంత అని ఇంటర్నెట్‌లో వెదికిన ఫ్యాన్స్‌ కు దాని ధర చూసి స్టన్ అవుతున్నాయి.. చూడటానికి చాలా సింపుల్ గా ఉన్న ఈ డ్రెస్సు ఖరీదు అక్షరాల రూ.75 వేలని వార్తలు వినిపిస్తున్నాయి..

ఆ డ్రెస్సు ప్రింటెడ్ సిల్క్ షర్ట్ , ప్యాచ్‌వర్క్‌తో కూడిన వైబ్రెంట్ కలర్స్ వైలెట్, పింక్, గ్రీన్ పీచ్ రంగులలో పలాజోను ధరించింది కరీనా.దీనికి మ్యాచింగ్‌గా ఆస్ట్రేలియన్ ఫ్యాషన్ లేబుల్‌ జిమ్మెర్‌ మాన్‌ చెందిన సిల్క్ కో-ఆర్డ్ సెట్‌లో ఫ్లవర్‌ పైస్లీ ప్రింట్‌ టాప్‌, ఏవియేటర్-శైలి సన్ గ్లాసెస్‌ ఆమె లుక్‌ మరింత ఎలివేట్‌ చేసింది.. గత ఏడాది తన 42వ పుట్టినరోజు సందర్భంగా, కరీనా కపూర్ సెక్సీ జిమ్మెర్‌మాన్ ర్యాప్ డ్రెస్‌లో ఆకట్టుకుంది. రూ. 59,999 విలువైన ఈ ర్యాప్ డ్రెస్‌కు తోడు మినీ బ్లాక్ బకెట్ బ్యాగ్‌తో చాలా స్టైల్ గా కనిపించి ఆకట్టుకుంది.. ప్రస్తుతం సినిమాలు పెద్దగా చేయట్లేదని తెలుస్తుంది.. యాడ్స్ వరకు చేస్తూ బిజీగా ఉంటుంది..

Exit mobile version