సౌత్ ఇండియన్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నటి నయనతార. కేవలం గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా, కథానాయిక ప్రాధాన్యత ఉన్న సినిమాలతో బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టించారు. అందుకే అభిమానులు ఆమెను ప్రేమగా ‘లేడీ సూపర్ స్టార్’ అని పిలుచుకుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ.. బాషలో నటిస్తూ దక్షిణ భారత దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే నటీమణులలో ఒకరుగా నిలుస్తోంది. అయితే తాజాగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ నయన గురించి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఒక ఇంటర్వ్యూలో కరీనా మాట్లాడుతూ.. ‘మలయాళ సినిమా నుంచి వచ్చిన అత్యుత్తమ నటీమణులలో నయనతార ఒకరు. ఆమె నటన చాలా సహజంగా ఉంటుంది. నిజంగా చెప్పాలంటే, ఆమె భారతదేశపు అతిపెద్ద మహిళా సూపర్ స్టార్’ అని ప్రశంసించారు. షారుఖ్ ఖాన్ సరసన ‘జవాన్’ సినిమాతో బాలీవుడ్‌లోనూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటారు. నార్త్ ఆడియెన్స్ కూడా ఆమె నటనకు ఫిదా అవుతున్న తరుణంలో, కరీనా కపూర్ లాంటి స్టార్ హీరోయిన్ ఆమెను “ఇండియాస్ బిగ్గెస్ట్ ఫిమేల్ సూపర్ స్టార్” అని సంబోధించడం నయనతార రేంజ్‌ను మరోసారి నిరూపించింది. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. నయనతార అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ.. “టాలెంట్ ఎప్పుడూ గుర్తించబడుతుంది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
