Karate Kalyani: టాలీవుడ్ డైరెక్టర్ సూర్యకిరణ్ పచ్చ కామెర్లతో నిన్న ఉదయం చనిపోయిన విషయం తెల్సిందే. బాలనటుడిగా ఎన్నో మంచి సినిమాల్లో నటించి, డైరెక్టర్ గా రెండు అవార్డులను కూడా అందుకున్న సూర్యకిరణ్.. బిగ్ బాస్ సీజన్ 4 లో కూడా పాల్గొన్నాడు. ఇక ఒకప్పటి హీరోయిన్ కళ్యాణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న సూర్య కిరణ్.. కొన్ని ఆర్థిక విబేధాల వలన విడాకులు తీసుకున్నాడు. ఇక విడాకుల తరువాత అతను బాగా కృంగిపోయినట్లు తెలుస్తోంది. తాజాగా సూర్యకిరణ్ మృతిపై కరాటే కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేసింది. ఎక్కువ మద్యానికి బానిస అవ్వడం వలనే సూర్యకిరణ్ మృతి చెందినట్లు తెలిపింది. కరాటే కళ్యాణి, సూర్యకిరణ్.. బిగ్ బాస్ 4లో కలుసుకున్నారు. బిగ్ బాస్ నుంచి బయటకి వచ్చాక కూడా వారు మంచి స్నేహితులుగా ఉన్నారు.
ఇక సూర్యకిరణ్ మరణవార్త విన్న కరాటే కళ్యాణి ఒక మంచి స్నేహితుడును కోల్పోయినట్లు తెలిపింది. ” సూర్యకిరణ్, కళ్యాణిని ఎంతో ప్రేమించాడు. వారిద్దరి మధ్య చిన్న చిన్న మనస్పర్థలే.. విడాకులు వరకు వెళ్లాయి. ఆమె వెళ్ళిపోయాక సూర్యకిరణ్ సిగరెట్లు, మద్యానికి బానిసగా మారాడు. ఆమె తప్ప ఇంకెవరు తనకు వద్దని, ఏదో ఓరోజు కల్యాణినే తిరిగివస్తుంది చెప్పుకొచ్చేవాడు. ఇక ఆమె రాకపోతే ఏంటి పరిస్థితి అని రాత్రంతా తాగుతూ కూర్చునేవాడు. అలా ఆయనకు పచ్చ కామెర్లు వచ్చాయి. ఆ విషయం కూడా సూర్యకిరణ్ కు తెలియలేదు. ఆపై ప్రతి రోజూ మద్యం సేవించడంతో ఆ సమస్య ఎక్కువ అయింది. ఆ తరువాత ఆయన గుర్తించినా ఉపయోగం లేకపోయింది. ఇక పచ్చ కామెర్లు ముదరడంతో వైద్యులు కూడా చేతులెత్తేశారు. జాండిస్ ఉన్న సమయంలో ఎక్కువగా మద్యం తీసుకోవడం వలనే సూర్యకిరణ్ చనిపోయాడు. అదే అతను చేసిన తప్పు” అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.