NTV Telugu Site icon

Karate Kalyani: మా అసోసియేషన్ నుంచి కరాటే కళ్యాణి సస్పెండ్

Karate Kalyani

Karate Kalyani

Karate Kalyani: టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నిత్యం ఏదో ఒక వివాదంలో ఆమె పేరు నానుతూనే ఉంటుంది. ఇక గత కొన్ని రోజులుగా ఆమె ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుపై పోరాడుతున్న విషయం తెల్సిందే నందమూరి తారక రామారావు జయంతిని పురస్కరించుకుని ఖమ్మంలో 54 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న విషయం తెల్సిందే. మే 28 న ఈ విగ్రహావిష్కరణ జరగనుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడానికి వీల్లేదని, ఎన్టీఆర్ దేవుడు కాదని సంచలన వ్యాఖ్యలు చేసింది. కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించడంపై ఆమె పలు ఆరోపణలు చేసింది. ” ఎన్టీఆర్ ఎవరికి దేవుడు.. ఏ వర్గానికి దేవుడు.. ఎవరి కోసం ఆయన్ను దైవాన్ని చేస్తూన్నారు…ఎవరిని మెప్పించడానికి ఇదింతా చేస్తున్నారని ప్రశ్నించారు. దైవానికి , మానవునికి తేడా ఉందా లేదా… మానవుడు దేవుడైతే.. ఇంకా మనం దేవుళ్లని పూజించడం ఎందుకని.. మన ఫొటోలను పెట్టుకుని మనకు మనమే పూజించుకోవచ్చు” అని చెప్పుకొచ్చింది. ఆమెకు తోడుగా యాదవ సంఘాలు కూడా ఆ విగ్రహాన్ని కూల్చివేయాలని డిమాండ్ చేశారు.

Tina Turner: ప్రముఖ సింగర్ కన్నుమూత

ఇక ఈ వివాదం ప్రస్తుతం కరాటే కళ్యాణి మెడకు చుట్టుకున్నట్లు అయ్యింది. ఎన్టీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఆమెపై మా అసోసియేషన్ చర్యలు తీసుకుంది. ఈ నెల 16 వ తేదీన ఆమె చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ షో కేస్ నోటీసులను జారీచేసింది. అయితే ఆ నోటీసులపై ఇప్పటివరకు కళ్యాణి స్పందించకపోవడంతో మా అసోసియేషన్ నుంచి కరాటే కళ్యాణిని సస్పెండ్ చేసినట్లు మా సభ్యులు తెలిపారు. ఆదేశాలను జారీ చేస్తూ ప్రకటన రిలీజ్ చేశారు. ” ఈ నెల 16 వ తేదీన మేము పంపిన షోకాజ్ నోటీసుకు నిర్ణీత సమయంలోగా వివరణను ఫైల్ చేయడంలో మీరు విఫలం చెంది, ఆ తరువాత లీగల్ నోటీసులు జారీ చేయగా .. వాటికి కూడా సమాధానం చెప్పకపోవడం MAA సభ్యుల కోసం నిర్దేశించిన ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుంది. దీనిపై మా అసోసియేషన్ నేడు చర్చించి తక్షణమే మిమ్మల్ని సస్పెండ్ చేయడం జరిగింది” అంటూ రాసుకొచ్చారు. మరి ఈ విషయమై కరాటే కళ్యాణి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.