NTV Telugu Site icon

Karate Kalyani: బేగంపేట బజార్ లో బట్టలు విప్పి కొట్టాడు వాడు..

Karate Kalyani

Karate Kalyani

Karate Kalyani: టాలీవుడ్ నటి కరాటే కళ్యాణి గురించి ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సినిమాలే లేకుండా మహిళా హక్కుల కోసం కూడా ఆమె పోరాడుతూ ఉంటుంది. ఇక కరాటే కల్యాణికి వివాదాలు కొత్తేమి కాదు. నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకొనే ఆమె గతంలో ఎన్నో కష్టాలు పడిందని చాలా కొంతమందికే తెలుసు. కళ్యాణి విడాకులు తీసుకోవడానికి కారణం ఆమె భర్త మూర్ఖపు ప్రవర్తన అని, ఇప్పటివరకు ఆమె తల్లి కాకపోవడానికి అతడే కారణమని ఆమె చాలా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. తాజాగా మరో ఇంటర్వ్యూలో ఆమె తన గతాన్ని నెమరువేసుకొని ఎమోషనల్ అయ్యింది.

“నా బతుకుదెరువు కోసం నేను సినిమాల్లో నటిస్తున్నాను. అందరు నాలో ఉన్న బాబీ క్యారెక్టర్ ను మాత్రమే చూస్తారు. వారికి తెలియని మరో కోణం నాలో ఉంది. నా భర్తను నేను ఎంతో ప్రేమించాను. కానీ, అతను నన్ను చాలా వేధించాడు. అతను పెట్టిన టార్చర్ నేను మాటల్లో చెప్పలేను. చిన్నదానికి కూడా కొట్టేవాడు. ఒకసారి బేగంపేట బజార్ లో నా బట్టలు విప్పి మరీ నన్నుకొట్టాడు వాడు. నడిరోడ్డుపై ద్రౌపది వస్త్రాపహరణం అయ్యింది నాకు. అందుకే ఆ టార్చర్ భరించలేకే వాడికి విడాకులిచ్చాను. ఆ తరువాత నిజమైన ప్రేమ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి తపిస్తున్నాను. ఎప్పటినుంచో నాకు రెండో పెళ్లి చేసుకోవాలని ఉంది. నాకు నచ్చిన వ్యక్తి దొరికితే కచ్చితంగా పెళ్లి చేసుకుంటా” అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి.