NTV Telugu Site icon

Kantara 2: మోస్ట్ అవైటెడ్ అనౌన్స్మెంట్ వచ్చేసింది…

Kantara 2

Kantara 2

కాంతార… 2022లో బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన సినిమా. కన్నడలో రూపొందిన ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ, అతి తక్కువ సమయంలోనే క్లాసిక్ గా పేరు తెచ్చుకోని పాన్ ఇండియా హిట్ అయ్యింది. కన్నడ నుంచి సౌత్, అటు నుంచి నార్త్ కి వెళ్లి కాసుల వర్షం కురిపించిన కాంతార సినిమాని రిషబ్ శెట్టి అద్భుతంగా నటిస్తూ తెరకెక్కించాడు. హోమ్బెల్ ఫిల్మ్ మేకర్స్ నుంచి వచ్చిన ఈ మాస్టర్ పీస్ కి స్టార్టింగ్ పావు గంట, క్లైమాక్స్ అరగంట పంచ ప్రాణులుగా నిలిచాయి. కాంతార సినిమాని అంత గొప్పగా మార్చిన ఇంకో విషయం ‘వరాహరూపం’ సాంగ్, ఈ పాట వినీ గూస్ బంప్స్ రాని ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. పర్ఫెక్ట్ క్రాఫ్ట్స్ మెన్ సినిమాగా పేరు తెచ్చుకున్న కాంతార రీజనల్ సినిమాగా ప్రయాణం మొదలుపెట్టిన కాంతార సినిమా ఇంటర్నేషనల్ రీచ్ ని సొంతం చేసుకుంది.

కాంతారా 2 కోసం మూవీ లవర్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తుంటే… రాబోయేది సీక్వెల్ కాదు ప్రీక్వెల్… కాంతార 2ని మీరు ఆల్రెడీ చూసేసారు 1 త్వరలో రాబోతుంది అంటూ షాక్ ఇచ్చాడు రిషబ్ శెట్టి. ఈ ప్రీక్వెల్ నుంచి మేకర్స్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసారు. గత రెండేళ్లుగా అభిమానుల వెయిటింగ్ కి ఎండ్ కార్డ్ వేస్తూ… “ఈసారి జస్ట్ లైట్ కాదు ఏకంగా దర్శనమే” అంటూ హోంబలే అనౌన్స్మెంట్ ఇచ్చేసింది. ఈ మచ్ అవైటెడ్ మూవీ ఫస్ట్ లుక్… నవంబర్ 27న మధ్యాహ్నం 12:25 నిమిషాలకి రిలీజ్ కానుంది. కాంతార చాప్టర్ 1 స్టార్టింగ్ నుంచే పాన్ ఇండియా సినిమా ప్రమోట్ అవ్వనుంది. కాంతారలో మనం చూసిన ఫస్ట్ 20 మినిట్స్ కి ముందు జరిగిన కథ(శివ తండ్రి కథ)తో ఈ సినిమా తెరకెక్కనుంది. అయితే కాంతార సినిమాకి ప్రధాన బలం, “భూతకోల” ఈ భూతకోలని ఎలా చేస్తారు? ఎక్కడ చేస్తారు లాంటి విషయాలని ఫస్ట్ పార్ట్ లోనే బ్యూటిఫుల్ గా చూపించేశారు కాబట్టి ప్రీక్వెల్ లో రిషబ్ శెట్టి కొత్తగా ఏం చూపిస్తాడు అనేది ఆలోచించాల్సిన విషయమే.