Site icon NTV Telugu

kantara Chapter-1: కాంతార ఛాప్టర్-1 లో రిషబ్ శెట్టి డ్యూయెల్ రోల్ చేశాడని తెలుసా?

Kantara Chapter1

Kantara Chapter1

దసరా పండుగకి రిలీజ్ అయిన ‘కాంతార చాప్టర్-1’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి హిట్ అందుకుందో చెప్పక్కర్లేదు. పులి సీన్‌, ఇంటర్వెల్ బ్లాక్‌, సెకండ్ హాఫ్ ట్విస్ట్‌, క్లైమాక్స్‌ సీక్వెన్స్‌లు మాత్రం సినిమాను బలంగా నిలబెట్టాయని చెప్పాలి. ముఖ్యంగా క్లైమాక్స్‌లో చివరి 20 నిమిషాలు ఎమోషన్‌, రిషబ్ శెట్టి యాక్టింగ్‌, విజువల్ ప్రెజెంటేషన్‌ అన్నీ కలిపి థియేటర్‌లో ఆడియెన్స్‌కి గూస్‌బంప్స్ తెప్పించాయి. హీరోయిన్‌ పాత్ర కూడా సినిమా హైలైట్‌ అయింది. ఆమె ట్విస్ట్‌ వద్ద థియేటర్‌లో క్షణం పాటు ఎవరికీ ఊపిరి కూడా ఆడలేదు.

Also Read: Samantha : “నా లైఫ్‌లో ఉన్న ఆ వ్యక్తి గురించి ఇప్పుడేం చెప్పలేను.. కానీ సమయం వచ్చినప్పుడు చెబుతాను”

అయితే సినిమాలో అందరి కంటే ఎక్కువ ఆసక్తిని రేపిన పాత్ర ‘మాయావి’. ఈ మాయావిని కేవలం హీరో రిషబ్ శెట్టి మాత్రమే చూస్తాడు. ఆయన తప్ప మరెవరికీ కనపడడు. సినిమా మొత్తంలో మాయావి రిషబ్ శెట్టిని గైడ్ చేస్తూ, అతని బలం ఏంటి, భూమిపై ఆయన ఉన్న కారణం ఏంటి అనే సీక్రెట్ చెబుతుంటాడు. ప్రతి సారి బర్మ (హీరో) కుంగిపోతే వెన్ను తట్టి లేపుతుంటాడు. క్లైమాక్స్‌ సీన్‌ వరకు మాయావి ఉనికి రహస్యంగానే ఉంటుంది. అయితే ఇక్కడే ట్విస్ట్ ఉంది.. ఆ మాయావి పాత్రను పోషించింది వేరెవరో కాదు రిషబ్ శెట్టి అంటా. ఇందులో ఎంత వరకు నిజం ఉందో తెలియదు కానీ. ఈ ట్విస్ట్ తెలిసిన తర్వాత ఫ్యాన్స్ షాకింగ్‌గా రియాక్ట్ అయ్యారు.

Exit mobile version