కాంతారా కన్నడ సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్. కన్నడ యంగ్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎటుంవంటి అంచనాలు లేకుండా జస్ట్ రూ. 16 కోట్లతో తీస్తే సుమారు రూ. 450 కోట్ల కలెక్షన్లను రాబట్టుకొంది. తెలుగు, తమిళ్, హిందీ చిత్ర పరిశ్రమలలో రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. ఇప్పడు కాంతారా కు ప్రీక్వెల్ గా కాంతారా చాఫ్టర్ 1 ను తీసుకువస్తున్నారు. నిర్మాతలైన హోంబలే ప్రీసీక్వెల్ కోసం భారీగా ఖర్చు పెడుతోంది.
Also Read : Sithara Entertainments : చందు మొండేటి డైరెక్షన్ లో ‘వాయుపుత్ర’.. రిలీజ్ డేట్ ఎప్పుడంటే
ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా ఈ ఏడాది గాంధీ జయంతి నాడు అనగా అక్టోబరు 2న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతుంది. మరోవైపు ఈ సినిమా థియేట్రికల్ రైట్స్ కు భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ నేపధ్యంలోనే కాంతారా మలయాళం రైట్స్ ను కేరళ స్టార్ హీరో పృద్వి రాజ్ సుకుమారన్ దక్కించుకున్నారు. పృద్విరాజ్ కు చెందిన పృద్విరాజ్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ద్వారా రిలీజ్ అవుతోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాను కేరళలో బ్యాన్ చేసారు ఎగ్జిబిటర్స్. డిస్ట్రిబ్యూటర్స్ కు మరియు ఎగ్జిబిటర్స్ కు మధ్య షేర్ పర్సెంట్ పై వివాదం నెలకొంది. రెగ్యులర్ గా డబ్బింగ్ సినిమాలకు ఇచ్చే పర్సెంట్ కంటే డిస్ట్రిబ్యూటర్స్ ఎక్కువ ఆడుతున్నారని అందుకు తాము ఒప్పుకుని తీరేది లేదని తేల్చి చెప్పేసారు డిస్టిబ్యూటర్స్. ఈ విషయంమై చర్చలు జరిపిన ఎగిబిటర్స్ మూకుమ్మడిగా కేరళలో కాంతారా చాఫ్టర్ 1 ను రిలీజ్ బ్యాన్ చేస్తున్నామని తేలిపాయి. మరోకొద్దీ రోజుల్లో విడుదలకు రెడీ అవుతుండగా ఇప్పుడు నెలకొన్న ఈ వివాదానీకు మేకర్స్ ఎలా ఫుల్ స్టాప్ పెడతారో చూడాలి.
