NTV Telugu Site icon

Kantara 2: రిషబ్ శెట్టి మొదలు పెట్టాడు… ఈసారి అంతకుమించి

Kantara 2

Kantara 2

కన్నడ ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి KGF తర్వాత ఆ రేంజులో పాన్ ఇండియా బాక్సాఫీస్ ని కాంకర్ చేసిన సినిమా కాంతార. థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి బెస్ట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన కాంతార, కన్నడలో రూపొందిన ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి అతి తక్కువ సమయంలోనే కల్ట్ క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది. రిలీజ్ అయిన సెకండ్ వీక్ నుంచి కన్నడ సరిహద్దులు దాటి మిగిలిన ప్రాంతాలకి వ్యాపించిన కాంతార మ్యాజిక్ పాన్ ఇండియా మొత్తం వ్యాపించింది. కాంతార సినిమాని రిషబ్ శెట్టి అద్భుతంగా నటిస్తూ తెరకెక్కించాడు. హోమ్బెల్ ఫిల్మ్ మేకర్స్ నుంచి వచ్చిన ఈ మాస్టర్ పీస్ కి స్టార్టింగ్ పావు గంట, క్లైమాక్స్ అరగంట పంచ ప్రాణులుగా నిలిచాయి. కాంతార సినిమాని అంత గొప్పగా మార్చిన ఇంకో విషయం ‘వరాహరూపం’ సాంగ్, ఈ పాట వినీ గూస్ బంప్స్ రాని ప్రేక్షకుడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. పర్ఫెక్ట్ క్రాఫ్ట్స్ మెన్ సినిమాగా పేరు తెచ్చుకున్న కాంతార సినిమాకి ప్రీక్వెల్ గా కాంతార 2 స్క్రిప్ట్ వర్క్ మొదలుపెట్టాడు రిషబ్ శెట్టి.

కోస్టల్ కర్ణాటకలో కాంతార 2 స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది, ఉగాది పండగ సంధర్భంగా రిషబ్ శెట్టి అఫీషియల్ గా ఈ విషయాన్ని అనౌన్స్ చేశాడు. ఫస్ట్ పార్ట్ ముందు కర్ణాటక వరకే పరిమితం అయ్యింది ఇప్పుడు పార్ట్ 2 మాత్రం స్టార్టింగ్ నుంచే పాన్ ఇండియా సినిమా ప్రమోట్ అవ్వనుంది. స్క్రిప్ట్ వర్క్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత జూన్ నుంచి కాంతార 2 మూవీ రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్ ఉందని శాండల్ వుడ్ వర్గాల సమాచారం. కాంతార ఫస్ట్ పార్ట్ లో మనం చూసిన ఫస్ట్ 20 మినిట్స్ కి ముందు జరిగిన కథ(శివ తండ్రి కథ)తో కాంతార 2 తెరకెక్కనుంది. అయితే కాంతార సినిమాకి ప్రధాన బలం, “భూతకోల” ఈ భూతకోలని ఎలా చేస్తారు? ఎక్కడ చేస్తారు లాంటి విషయాలని ఫస్ట్ పార్ట్ లోనే బ్యూటిఫుల్ గా చూపించేశారు కాబట్టి జూన్ నుంచి సెట్స్ పైకి వెళ్లనున్న ప్రీక్వెల్ లో రిషబ్ శెట్టి కొత్తగా ఏం చూపిస్తాడు అనేది ఆలోచించాల్సిన విషయమే.

Show comments