Kannada Villains : తెలుగు సినిమాల్లో బలమైన విలన్లుగా ముద్ర వేస్తున్నారు కన్నడ నటులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎప్పుడూ విలనిజానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ఒకప్పుడు బాలీవుడ్, కోలీవుడ్ నటులు టాలీవుడ్ సినిమాల్లో ప్రతినాయకులుగా మెరిసేవారు. కానీ ప్రస్తుతం ట్రెండ్ మారింది. ఇప్పుడు మన తెలుగు దర్శకుల చూపు కన్నడ చిత్ర పరిశ్రమ వైపు మళ్లింది. కన్నడ నటులు తమదైన రగ్గడ్ లుక్స్, నేచురల్ ఇంటెన్సిటీతో తెలుగు తెరపై పవర్ఫుల్ విలన్లుగా బలమైన ముద్ర వేస్తున్నారు.
టాలీవుడ్లో కన్నడ విలన్ల హవా అనగానే మనకు ముందుగా గుర్తొచ్చే పేరు డాలీ ధనంజయ్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గ్లోబల్ హిట్ చిత్రం ‘పుష్ప: ది రైజ్’లో జాలీ రెడ్డి పాత్రలో డాలీ ధనంజయ్ కనబరిచిన నటన ఇప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోయింది. చాలా మంది విశ్లేషకులు ప్రధాన విలన్ల కంటే జాలీ రెడ్డి పాత్రే సినిమాలో కథను మలుపు తిప్పడంలో ఎంతో ప్రభావవంతంగా నిలిచిందని అభిప్రాయపడ్డారు. ఇక ఇటీవల విడుదలైన భారీ చిత్రాల్లోనూ కన్నడ నటుల హవా స్పష్టంగా కనిపిస్తోంది. లేటెస్ట్ సెన్సేషన్ ‘లెనిన్‘ సినిమాలో ప్రమోద్ పంజు తన పెర్ఫార్మెన్స్తో విమర్శకుల ప్రశంసలు అందుకోగా.. మోస్ట్ అవేటెడ్ సీక్వెల్ ‘పుష్ప 2: ది రూల్‘ లో తారక్ పొన్నప్ప తన క్రూరమైన విలనిజం, సాలిడ్ స్క్రీన్ ప్రెజెన్స్తో థియేటర్లలో ఆకట్టుకుంటున్నారు. కన్నడ నటులు కేవలం డైలాగ్స్ చెప్పడమే కాకుండా, తమ కళ్లతోనే విలనిజాన్ని పండించడంలో దిట్టలుగా పేరు తెచ్చుకుంటున్నారు. వారి సహజసిద్ధమైన బాడీ లాంగ్వేజ్, కరుడుగట్టిన విలన్ పాత్రలకు సరిగ్గా సరిపోయే రగ్గడ్ స్క్రీన్ ప్రెజెన్స్ కారణంగా తెలుగు స్టార్ డైరెక్టర్లు తమ సినిమాల కోసం కన్నడ నటులనే ఫస్ట్ ఆప్షన్గా ఎంచుకుంటున్నారు. రాబోయే రోజుల్లో మరికొంతమంది కన్నడ టాలెంటెడ్ నటులు తెలుగులో పెద్ద ప్రాజెక్టుల ద్వారా విలన్లుగా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతున్నారు.
Also Read
- Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్... హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
- Haindava Teaser: "ఆ దేవుళ్ల విగ్రహాల్లో దాగి ఉన్న రహస్యమేంటి?".. ‘హైందవ’ టీజర్ చూశారా!
- Prabhas Surprise: ఇమాన్వీకి ప్రభాస్ బర్త్డే గిఫ్ట్.. ఫిదా అయిన హీరోయిన్!
- Radha Krishna: చాలా కాలం తర్వాత మీడియా ముందుకు రాధే శ్యామ్ దర్శకుడు
తాజావార్తలు
-
CM Revanth Reddy: విద్యుత్ అంతరాయాలపై సీఎం రేవంత్ ఆగ్రహం.. నిర్లక్ష్యం వహిస్తే సస్పెన్షన్ తప్పదు!
-
AP MPTC, ZPTC Elections: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై హైకోర్టులో కీలక పరిణామం.. తీర్పు రిజర్వ్
-
OTR: పవన్ పట్టు.. బాబు వ్యూహం.. ఎవరికి ఎన్ని సీట్లు?
-
Dada: బాలయ్య ఫ్యాన్స్కి గుడ్ న్యూస్… హైదరాబాద్లోనే ‘దాదా’ లాస్ట్ పంచ్!
-
Acer Sospiro A70 5G: Acer కొత్త 5G ఫోన్ లాంచ్.. డ్యుయల్ డిస్ప్లేలు, 20GB RAM, 64MP కెమెరా!
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..