Site icon NTV Telugu

Shivanna: బాలయ్య, విజయ్, రవితేజలతో డైరెక్ట్ క్లాష్ కి రెడీ…

Shivanna

Shivanna

జైలర్ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కన్నడ సూపర్ స్టార్ శివ రాజ్ కుమార్ పేరు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఈ మధ్య కాలంలో ఒక చిన్న క్యామియో రోల్ ప్లే చేసిన హీరోకి ఇంత పేరు రావడం ఇదే మొదటిసారి. నరసింహ పాత్రలో నటించిన శివన్న, జైలర్ సినిమా క్లైమాక్స్ లో తన స్క్రీన్ ప్రెజెన్స్ తో ఆడియన్స్ కి కట్టి పడేసాడు. ఆడియన్స్ థియేటర్స్ లో విజిల్స్ వేస్తూ శివన్న ఎంట్రీని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇదే జోష్ లో తన నెక్స్ట్ సినిమా పాన్ ఇండియా రేంజులో ఆడియన్స్ ముందుకి తీసుకోని రావడానికి శివన్న రెడీ అయ్యాడు. గ్యాంగ్ స్టర్ డ్రామా కథతో రూపొందుతున్న ‘ఘోస్ట్’ సినిమాలో శివన్న నటిస్తున్నాడు. ‘వన్స్ ఏ గ్యాంగ్ స్టర్, ఆల్వేస్ ఏ గ్యాంగ్ స్టర్’ అనే ట్యాగ్ లైన్ తో రూపొందుతున్న ‘ఘోస్ట్’ సినిమాని ‘బీర్బల్’ లాంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన ‘శ్రినీ’ డైరెక్ట్ చేస్తున్నాడు. సందేశ్ నాగరాజ్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘ఘోస్ట్’ సినిమాతో శివన్న పాన్ ఇండియా బాక్సాఫీస్ ని టార్గెట్ చెయ్యబోతున్నాడు.

కన్నడనాట సూపర్ స్టార్ ఇమేజ్ ఉన్న శివరాజ్ కుమార్, తన సినిమాని పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చెయ్యడం ఇదే మొదటిసారి. అక్టోబర్ 19న ఘోస్ట్ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో అక్టోబర్ 19న రిలీజ్ అవ్వనున్న దళపతి విజయ్ ‘లియో’ సినిమాతో ఘోస్ట్ కి డైరెక్ట్ క్లాష్ పడింది. రెండు పాన్ ఇండియా సినిమాలు ఒకే రోజున థియేటర్స్ లో రిలీజ్ అవ్వనున్నాయి. ఘోస్ట్ రాకతో లియో సినిమాకి కర్ణాటకాలో ఇబ్బందులు ఎదురవనున్నాయి. ఘోస్ట్ సినిమా లియోతోనే కాదు బాలయ్య భగవంత్ కేసరి, రవితేజ టైగర్ నాగేశ్వర రావు సినిమాలతో కూడా క్లాష్ కి దిగింది. శివన్న ఘోస్ట్ సినిమాతో హిట్ టాక్ రాబడితే లియో, భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వర రావు సినిమాలకి కర్ణాటకాలో ఓపెనింగ్స్ కూడా ఉండవు, థియేటర్స్ కూడా దొరకవు. మరి శివన్న అక్టోబర్ 19న ఏం చేస్తాడో చూడాలి.

Exit mobile version