Rakshit Shetty: రష్మిక మాజీ లవర్ పెళ్లి.. ఎవరితో అంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. కన్నడలో ‘కిర్రాక్ పార్టీ’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ అదే సినిమాలో తన సరసన నటించిన హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించి పెళ్లి పీటలు కూడా ఎక్కడానికి రెడీ అయింది. ఇక అదే సమయంలో తెలుగులో ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం అదికాస్తా హిట్ టాక్ తెచ్చుకోవడంతో వరుస అవకాశాలు రశ్మికకు వెల్లువెత్తాయి. అందులో ‘గీతా గోవిందం’ ఒకటి. విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిన ఈ బ్యూటీ ఈ ఒక్క సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక ఆ తరువాత వెనుతిరిగి చూసుకోకుండా స్టార్ హీరోయిన్ రేంజ్ పట్టేసింది. ఇక పేరుతో పాటు అమ్మడి చుట్టూ వివాదాలు కూడా మూగాయి. ఈ సినిమాలో విజయ్ తో మితిమీరిన ముద్దు సన్నివేశాల వలన రక్షిత్ శెట్టి తో వివాహం క్యాన్సిల్ అయ్యింది. అంగరంగ వైభవంగా ఎంగేజ్ మెంట్ జరుపుకున్న ఈ జంట తాము పెళ్లి కాకుండానే విడిపోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు.
ఇక విడిపోయాక కూడా ఈ జంట స్నేహితులుగానే కంటిన్యూ అవుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు తమతమ కెరీర్ ను బిల్డ్ చేసుకొనే పనిలో పడ్డారు. ఇటీవలే రక్షిత్ నటించిన ‘చార్లీ’ తెలుగులో కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక తాజాగా ఈ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కన్నడ ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమంటున్నాయి. ‘ఉలిదవవరు కందంటే’ చిత్రంలో హీరోయిన్ గ నటించిన రమ్య ను రక్షిత్ పెళ్లి చేసుకుంటున్నాడంటూ పుకార్లు మొదలయ్యాయి. ఇక ఈ వార్తపై రక్షిత్ స్నేహితుడు, నటుడు రిషబ్ శెట్టి స్పందించాడు.. “మావాడికి సాండల్‌వుడ్ గోల్డెన్ గర్ల్‌తో పెళ్లా? అని ఫక్కున నవ్వేశాడు. అంతేకాకుండా ఆమెపై రక్షిత్ కే కాదు మాకు క్రష్ ఉంది. కాలేజ్ రోజుల నుంచి ఆమెను మేము ఎంతో ఆరాధించేవాళ్ళం.. ‘ఉలిదవవరు కందంటే’ చుసిన రక్షిత్ ఆమె నటన ఎంతో బావుందని మెచ్చుకున్నాడు. అంతే తప్ప పెళ్లి లేదు, ఏమి లేదు.. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఏవేవో ఊహించేసుకొని రాసేసే ఉంటాయి” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో రక్షిత్ పెళ్లి వార్తలకు చెక్ పడినట్లయింది.
Also Read
- "Aadarsha Kutumbam" కి రీషూట్లు! జాగ్రత్తపడ్డ త్రివిక్రమ్
- Pawan Kalyan: "ఒకవేళ OG2 తీస్తే.. దానికి స్పెషల్ గెస్ట్ నువ్వే!".. హన్మకొండ అభిమానికి పవన్ కళ్యాణ్ ప్రామిస్!
- Dia Mirza : ప్రకృతి వనరులను అమ్మాయిలా వాడుకుని వదిలేయకండి.. నాగ్ హీరోయిన్ కామెంట్స్
- Keerthy Suresh : కీర్తి సురేష్ కోర్ట్‌రూమ్ డ్రామా రిలీజ్ డేట్ ఫిక్స్ ...
- Tags
తాజావార్తలు
-
Tamannaah: ‘కావాలయ్యా ’ సాంగ్‌లో నా డ్యాన్స్ నాకే నచ్చలేదు.. తమన్నా షాకింగ్ కామెంట్స్!
-
Shyamala: శాంతిభద్రతలపై మౌనం.. మేకప్‌పై స్పందన.. హోంమంత్రి వ్యాఖ్యలకు ఆరే శ్యామల కౌంటర్..
-
Sharwanand : మళ్ళీ సంక్రాంతిపై కన్నేసిన శర్వా
-
Melodi: ‘‘ఇన్‌స్టాలో మనమే ఫేమస్ కపుల్’’.. జీ7లో స్పెషల్ అట్రాక్షన్‌గా మోడీ-మెలోనీ
-
“Aadarsha Kutumbam” కి రీషూట్లు! జాగ్రత్తపడ్డ త్రివిక్రమ్
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Controversy: వైభవ్ అవుట్‌పై వివాదం.. థర్డ్ అంపైర్ నిర్ణయంపై అఫ్గాన్ ప్లేయర్స్ అసంతృప్తి!
-
Ragi Bun Dosa: ఆరోగ్యం, రుచి రెండూ ఒకేచోట.. స్పాంజీ లాంటి ‘రాగి బన్ దోస’ ఇంట్లోనే చేసేయండి ఇలా.!
-
Wedding Expenses: పెళ్లి ముహూర్తాలకు వేళాయే.. తక్కువ టైమ్ ఉండటంతో తెలుగు ఇళ్లల్లో బడ్జెట్ టెన్షన్!!
-
Ayodhya Ram Mandir: రాముడికి ప్రసాదంగా ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి పండ్లు.!
-
Historical Day: నేడు ట్రిపుల్ ధమాకా.. టీమిండియా ఫ్యాన్స్‌కు పండగే.. 12 గంటల పాటు నాన్‌స్టాప్ ఎంటర్టైన్మెంట్!