టాలీవుడ్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. కన్నడలో ‘కిర్రాక్ పార్టీ’ సినిమాతో వెండితెరకు పరిచయమైన ఈ బ్యూటీ అదే సినిమాలో తన సరసన నటించిన హీరో రక్షిత్ శెట్టిని ప్రేమించి పెళ్లి పీటలు కూడా ఎక్కడానికి రెడీ అయింది. ఇక అదే సమయంలో తెలుగులో ‘ఛలో’ సినిమాతో ఎంట్రీ ఇవ్వడం అదికాస్తా హిట్ టాక్ తెచ్చుకోవడంతో వరుస అవకాశాలు రశ్మికకు వెల్లువెత్తాయి. అందులో ‘గీతా గోవిందం’ ఒకటి. విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా ఛాన్స్ పట్టేసిన ఈ బ్యూటీ ఈ ఒక్క సినిమాతో నేషనల్ క్రష్ గా మారిపోయింది. ఇక ఆ తరువాత వెనుతిరిగి చూసుకోకుండా స్టార్ హీరోయిన్ రేంజ్ పట్టేసింది. ఇక పేరుతో పాటు అమ్మడి చుట్టూ వివాదాలు కూడా మూగాయి. ఈ సినిమాలో విజయ్ తో మితిమీరిన ముద్దు సన్నివేశాల వలన రక్షిత్ శెట్టి తో వివాహం క్యాన్సిల్ అయ్యింది. అంగరంగ వైభవంగా ఎంగేజ్ మెంట్ జరుపుకున్న ఈ జంట తాము పెళ్లి కాకుండానే విడిపోతున్నట్లు ప్రకటించి షాక్ ఇచ్చారు.
ఇక విడిపోయాక కూడా ఈ జంట స్నేహితులుగానే కంటిన్యూ అవుతున్నారు. ప్రస్తుతం ఇద్దరు తమతమ కెరీర్ ను బిల్డ్ చేసుకొనే పనిలో పడ్డారు. ఇటీవలే రక్షిత్ నటించిన ‘చార్లీ’ తెలుగులో కూడా రిలీజ్ కు సిద్దమవుతుంది. ఇక తాజాగా ఈ హీరో పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు కన్నడ ఇండస్ట్రీలో వార్తలు గుప్పుమంటున్నాయి. ‘ఉలిదవవరు కందంటే’ చిత్రంలో హీరోయిన్ గ నటించిన రమ్య ను రక్షిత్ పెళ్లి చేసుకుంటున్నాడంటూ పుకార్లు మొదలయ్యాయి. ఇక ఈ వార్తపై రక్షిత్ స్నేహితుడు, నటుడు రిషబ్ శెట్టి స్పందించాడు.. “మావాడికి సాండల్‌వుడ్ గోల్డెన్ గర్ల్‌తో పెళ్లా? అని ఫక్కున నవ్వేశాడు. అంతేకాకుండా ఆమెపై రక్షిత్ కే కాదు మాకు క్రష్ ఉంది. కాలేజ్ రోజుల నుంచి ఆమెను మేము ఎంతో ఆరాధించేవాళ్ళం.. ‘ఉలిదవవరు కందంటే’ చుసిన రక్షిత్ ఆమె నటన ఎంతో బావుందని మెచ్చుకున్నాడు. అంతే తప్ప పెళ్లి లేదు, ఏమి లేదు.. కొన్ని యూట్యూబ్ ఛానెల్స్ ఏవేవో ఊహించేసుకొని రాసేసే ఉంటాయి” అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో రక్షిత్ పెళ్లి వార్తలకు చెక్ పడినట్లయింది.