Bigg Boss 9 : కన్నడ బిగ్ బాస్ హౌస్ వివాదం దేశ వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే. ఈ బిగ్ బాస్ హౌస్ ను మంగళవారం నాడు అధికారులు మూసేశారు. బయట నుంచి తాళం వేసేశారు. ఈ బిగ్ బాస్ హౌస్ ఉన్న బిడదిలోని అమ్యూజ్ మెంట్ పార్కుకు జాలీవుడ్ స్టూడియో నుంచి ప్రతి రోజూ 2.5లక్షల మురుగునీరు వస్తోందని ఆరోపణలు వచ్చాయి. దీంతో కాలుష్య నియంత్రణ మండలి ముందుగా నోటీసులు జారీ చేశారు. అయినా సరే షో నిర్వాహకులు పెద్దగా పట్టించుకోలేదు. దీంతో లోకల్ ఎమ్మార్వో తేజస్విని అధికారులతో కలిసి బయట నుంచి తాళాలు వేశారు. స్టూడియోను మూయించి చర్యలు తీసుకున్నారు. దీంతో ఈ విషయం సౌత్ లో పెద్ద హాట్ టాపిక్ అయింది.
Read Also : Guru Gochar 2025: దీపావళి ముందు బృహస్పతి సంచారం.. ఆ 4 రాశుల వారికి ‘స్వర్ణకాలం’ మొదలు!
ఈ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం డీకే శివకుమార్.. వెంటనే ఓపెన్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. షో నిర్వాహకులకు మరో ఛాన్స్ ఇవ్వాలని సౌత్ డిస్ట్రిక్ట్ డిప్యూటీ కమిషనర్ కు ఆదేశాలు జారీ చేశారు. కన్నడలో కాలుష్యాన్ని కంట్రోల్ చేస్తూనే కళా రంగాన్ని ప్రోత్సహించాలన్నారు. ఈ రెండింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ రకమైన ఆదేశాలు జారీ చేసినట్టు ఆయన ఎక్స్ వేదికగా తెలిపారు. కన్నడ ఇండస్ట్రీకి ఎలాంటి సమస్యలు వచ్చినా డీకే శివకుమార్ వెంటనే స్పందిస్తూ వాటిని క్లియర్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక కన్నడ బిగ్ బాస్ లో ఎప్పుడూ ఏదో ఒక వివాదం నడుస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఈ వివాదంతో మరోసారి ట్రెండింగ్ లోకి వచ్చేసింది కన్నడ బిగ్ బాస్ హౌస్.
Read Also : Payal Gosh : తొమ్మిదేళ్లు శృంగారానికి దూరంగా ఉన్నా.. హీరోయిన్ బోల్డ్ కామెంట్స్
