NTV Telugu Site icon

Suresh Kondeti: అవార్డ్స్ కోసం పిలిచి అవమానిస్తావా.. ఏకిపారేస్తున్న నెటిజన్స్

Suresh

Suresh

Suresh Kondeti: సురేష్ కొండేటి.. ఈ పేరు గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సెలబ్రిటీల ప్రెస్ మీట్స్ లో అసలు ఎవరు అడగని ప్రశ్నలు అడగడం, సెలబ్రిటీల పర్సనల్ లైఫ్ కు సంబంధించిన విషయాలను ప్రెస్ మీట్ లో అడిగి విసిగించడం ద్వారా సురేష్ కొండేటి బాగా ఫేమస్ అయ్యాడు. ముఖ్యంగా డీజే టిల్లు సినిమా సమయంలో హీరోయిన్ నేహా ఒంటి మీద ఎన్ని పుట్టుమచ్చలు ఉన్నాయో మీరేమైనా లెక్కపెట్టారా.. ? అని అందరిముందు హీరో సిద్దును అడిగి పెద్ద వివాదానికి తెరలేపాడు. ఇక అప్పటినుంచి సురేష్ కొండేటి అడిగే ప్రశ్నలకు.. సెలబ్రిటీలు కౌంటర్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇక ఈ జర్నలిస్ట్.. ఎప్పటినుంచో సంతోషం అనే పేరుతో సెలబ్రిటీలకు అవార్డులు ఇవ్వడం మొదలుపెట్టాడు. ప్రతి ఏడాది ఈ వేడుక ఘనంగా జరుగుతుంది. ఇక ఈసారి హైదరాబాద్ లో కాకుండా ఈ వేడుకను గోవాలో ఎరేంజ్ చేశారు. టాలీవుడ్ మాత్రమే కాకుండా కోలీవుడ్, మాలీవుడ్, కన్నడ ఇండస్ట్రీలోని నటీనటులకు కూడా అవార్డ్స్ ను ప్రదానం చేస్తారు. ఈ నేపథ్యంలోనే సెలెక్ట్ అయినవారిని గోవాకు తీసుకురావడం, తిరిగి వారిని ఇంటికి పంపించడం మొత్తం సురేష్ చూసుకోవాలి. అయితే అలా అతిధులను చూసుకొనే విషయంలో సురేష్ బోల్తాపడ్డాడు. తెలుగువారికి అతిధి మర్యాదలు ఎంత ముఖ్యమో అందరికీ తెల్సిందే. కానీ సురేష్ కొండేటి మాత్రం ఈ ఈవెంట్ లో కన్నడ నటీమణులను అవమానించారని కన్నడ ఇండస్ట్రీ ఫైర్ అవుతుంది.

అసలు అక్కడ ఏం జరిగింది..?

సంతోషం అవార్డ్స్ వేడుకలో కన్నడవారికి అవమానం జరిగిందని ఒక జర్నలిస్ట్ ట్విట్టర్ ద్వారా తెలుపడంతో ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఆమె అందులో ఏం చెప్పిందంటే.. ” కన్నడ నుంచి అవార్డ్స్ ను తీసుకోవడానికి నటుడు ర‌మేష్ అర‌వింద్‌, స‌ప్త‌మిగౌడ‌, రాగిణి ద్వివేదితో పాటు ప‌లువురు క‌న్న‌డ న‌టీన‌టులు వచ్చారు. ఇక వారు అవార్డ్స్ తీసుకొనే టైమ్ లో లైట్స్ ఆఫ్ చేసి అవమానించారు. అనంతరం.. వారు స్టే చేసే హోటల్ బిల్స్ ను నిర్వాహకులు కట్టకపోవడంతో హోటల్ యాజమాన్యం.. నిర్మొహమాటంగా వారిని బయటకు పంపి రూమ్స్ కు లాక్ చేసారు. ఇక దీంతో చేసేదేమి లేక వారు రిసెప్షన్ లో నిలబడి.. సురేష్ కొండేటి కాల్ కోసం ఎదురుచూసారు. ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొన్నారు. చివరికి పోలీసులు జోక్యంతో అక్కడ ఉన్నవారు బయటపడ్డారు” అని రాసుకొచ్చింది. ఇక ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఈ ట్వీట్ చూసిన కన్నడ నటీనటులతో పాటు ఫ్యాన్స్ సైతం సురేష్ కొండేటిపై ఫైర్ అవుతున్నారు. అవార్డ్స్ కోసం పిలిచి అవమానిస్తావా.. ? ఇదేనా మీ బుద్ధి అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇక తెలుగు వారు సైతం సురేష్ ను ఏకిపారేస్తున్నారు. ఈవెంట్ జరుగుతుంది అంటే అన్ని సరిచూసుకోవాలి కదా.. ఇలా వారిని అవమానిస్తే.. మన పరువే పోతుంది. ప్రశ్నలు అడగడం కాదు.. ఇలాంటివి మేనేజ్ చేయాలి అంటూ ఏకిపారేస్తున్నారు.

సురేష్ కొండేటి ఏమన్నాడంటే.. ?

ఇక ఈ వివాదంపై సురేష్ కొండేటి స్పందించాడు. ” అందరికీ నమస్కారం .. గత 21 సం. గా నేను సంతోషం అవార్డ్స్ ఇస్తున్నాను .. ఇది పూర్తిగా నా వ్యక్తిగతం . దీనితో తెలుగు ఇండస్ట్రీ కి ఎటువంటి సంబంధం లేదు .. ప్రతి సం చాలా కష్టపడి, గ్రాండ్ గా నేను ఒక్కడినే 21 సంవత్సరాలుగా అవార్డ్స్ ఇస్తున్నాను .. నాకు అన్ని ఇండస్ట్రీ వాళ్లు సమానమే .. అందుకే 4 ఇండస్ట్రీ వాళ్లని కలిపి అవార్డ్స్ ఇస్తున్నాను. గోవా ఈవెంట్ లో జరిగిన కొంచం కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల వచ్చిన 1200 మందికి సెలబ్రిటీస్ కి రూమ్స్ సర్దుబాటు విషయంలో ఇబ్బంది జరిగింది. కన్నడ, తమిళ వాళ్లని ఇబ్బంది పెట్టడం నా ఉద్దేశం కాదు. ఇంత పెద్ద ఈవెంట్ లో కొన్ని పొరపాట్లు జరగడం కామన్ , అది ఉదేశ్య పూర్వకంగా చేసింది కాదు. దయచేసి అర్ధం చేసుకోగలరు. ఈవెంట్ వల్ల ఇబ్బంది పడి ఉంటే పేరు పేరునా సారీ చెప్తున్నాను నా మీద కావాలనే కొంత మంది కావాలని బురద జల్లుతున్నారు. పెద్ద మనసుతో మీరు అర్థం చేసుకుంటారని మనస్పూర్తిగా కోరుకుంటూ ఎప్పటికీ మీ సురేష్ కొండేటి” అంటూ రాసుకొచ్చాడు. ఏదిఏమైనా ఈ వివాదంతో సురేష్ కొండేటి పేరు మాత్రమే కాకుండా టాలీవుడ్ పేరు కూడా కన్నడ నాట నానుతుంది అన్నది వాస్తవం. మరి ఇది ఎక్కడివరకు వెళ్లి ఆగుతుందో చూడాలి.