Kannada Actor Veerendra Babu: ప్రముఖ కన్నడ నటుడు, నిర్మాత వీరేంద్ర బాబు అరెస్ట్ అయ్యాడు. పార్టీ తరపున తనకు టికెట్ ఇస్తానని చెప్పి తన వద్ద రూ.1.88 కోట్లు తీసుకొని మోసం చేశాడని బసవరాజా గోసాల్ అనే వ్యక్తి బెంగుళూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు వీరేంద్ర బాబును అరెస్ట్ చేశారు. వీరేంద్ర బాబు పలు కన్నడ సినిమాలో హీరోగా నటించాడు. ఆ తరువాత నిర్మాతగా మారి పలు సినిమాలను నిర్మించాడు. ఇక గత కొన్నేళ్ల క్రితం రాష్ట్ర జనహిత పార్టీని స్థాపించి రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలోనే బాబు మరియు ఇతరులు ANN ఛారిటబుల్ ట్రస్ట్ కలిసి కర్ణాటక రక్షణ పాడే అని న్యూస్ యూట్యూబ్ ఛానెల్‌ని నడుపుతున్నారు.
రాష్ట్రీయ జనహిత పక్షం నుంచి ఎమ్మెల్యే, ఎంపీ టిక్కెట్లు ఇప్పిస్తానని మాయమాటలు చెప్పి రాష్ట్రవ్యాప్తంగా పలువురి నుంచి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టారు. కోర్ కమిటీ వేసి సభ్యులకు ఒక్కొక్కరికి రూ.10వేలు చొప్పున నెల వేతనం చెల్లిస్తామని హామీ ఇచ్చారు. బాబు మరియు ఇతరులు తమ వెంచర్లలో పెట్టుబడి పెట్టడానికి వేలాది మందిని ప్రభావితం చేశారని, వారిని నమ్మి నేను, నా స్నేహితులు వారి వద్ద మొత్తం రూ.1.88 కోట్లు డిపాజిట్ చేసి మోసపోయాం’’ అని బసవరాజా గోసాల్ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక వీటికి తగిన ఆధారాలు ఉండడంతో పోలీసులు వెంటనే వీరేంద్ర బాబును అరెస్ట్ చేశారు. ప్రస్తుతం విచారణ జరుపుతున్నామని, త్వరలోనే అన్ని వివరాలు బయటపెడతామని పోలీసులు తెలిపారు.