NTV Telugu Site icon

Kanika Dhillon: వారు స్త్రీలను పశువుల్లా చూస్తారు.. రాఘవేంద్ర రావు మాజీ కోడలు షాకింగ్ కామెంట్స్

Kanika

Kanika

Kanika Dhillon:కనికా థిల్లాన్.. ఈ పేరు టాలీవుడ్ లో సగం మందికి తెలియకపోవచ్చు.. కానీ బాలీవుడ్ లో ఆమె ఫేమస్ రచయిత్రి. ఎన్నో మంచి కథలను బాలీవుడ్ కు అందించిన ఆమె మన దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు మాజీ కోడలని చాలా తక్కువ మందికి తెలుసు. రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి.. అదేనండీ అనుష్కతో కలిసి జీరో సైజ్ సినిమా తీసిన డైరెక్టర్ భార్యనే కనికా.. వీరిద్దిరి మధ్య విబేధాలు తలెత్తడంతో ఈ జంట 2017 లో విడాకులు తీసుకొని విడిపోయారు.. ఆ తర్వాత కనికా.. హిమాన్షు శర్మను వివాహమాడింది. ప్రస్తుతం ఆమె వరుస సినిమాలకు కథలను అందిస్తూ బిజీగా మారింది. ఇటీవల అక్షయ్ కుమార్ హీరోగా నటించిన రక్షా బంధన్ సినిమాకు కథను అందించింది కనికానే. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. చెల్లెళ్లకు పెళ్లి చేయడం కోసం అన్నయ్య పడే తపన.. అందుకోసం చెల్లెళ్ళపై అతడి చూపించే కోపం ఎలాంటివి అనేది ఈ సినిమాలో చూపించారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో కనికా ఈ కథపై మాట్లాడింది. ” ఈ సినిమా కథను నేను పట్టణంలో నివసించేవారు కోసం రాసుకోలేదు.. గ్రామంలో నివసించే ఆడపిల్లల కోసం రాసుకున్నాను.

భారతదేశంలో వరకట్న మరణాలపై అధికారిక గణాంకాలకు ఈ చిత్రం ప్రతిబింబంగా తెరకెక్కించాం. ఇందులో అక్షయ్ పాత్రలానే సమాజం ఉంది. వారు స్త్రీలను పశువుల్లా చూస్తారు.. ఆడపిల్ల పెళ్లి చేసుకోవాలంటే సన్నగా నాజూకుగానే ఉండాలి.. ఆమెకు ఎవరైనా విజిల్ వేస్తే వారినే పెళ్లాడాలి..? అని షరతులు విధిస్తారు. ఇలాంటివి సమాజంలో ఇంకా ఉన్నాయి అని చూపించే ప్రయత్నం చేశాం. అయితే మా లెక్క తప్పింది. ఎలాగంటే.. ప్రస్తుత యువత ఇలాంటివి చూడడానికి ఇష్టపడడం లేదు. అందుకే ఈ సినిమాను ప్రేక్షకులు ఆదరించలేదు. ఈ సినిమాలో ఆడవారిని అలా చూపించడం అనేది కొంతమంది వర్గాలకు నచ్చింది. నిజం చెప్పాలంటే మన దేశ గణాంకాలు కూడా అవే చెప్తున్నాయి. స్త్రీలను పశువులుగా చూడడం, బాడీ షేమింగ్, వివాహం కానీ స్త్రీలనే టార్గెట్ చేయడం.. ఆడపిల్లల కట్నాలు కోసం తల్లిదండ్రులు కష్టపడడం, వారి బాధ చూడలేక తమను తామే చంపుకోవడం.. ఇవన్నీ జరిగినవి.. జరుగుతున్నవి. అయితే ఇదంతా పట్టణ వాసులకు నచ్చకపోవొచ్చు.. కానీ మేము అనుకున్న ఒక వర్గం వారికి మాత్రం బాగా నచ్చింది.. అందులో మేము సక్సెస్ అయ్యాం”అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారింది.