Queen 2:13 ఏళ్ల తర్వాత కంగనా సెన్సేషన్.. షూటింగ్ పూర్తి, రిలీజ్‌పై ఆసక్తి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Queen 2: బాలీవుడ్లో లేడి ఓరియెంటెడ్ కథలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న చిత్రాల్లో ‘క్వీన్’ ఒకటి. కంగనా రనౌత్ కెరీర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లిన ఈ సినిమా విడుదలై దాదాపు 13 సంవత్సరాలు గడిచిన తర్వాత, ఇప్పుడు దాని సీక్వెల్ ‘క్వీన్ 2’పై ఆసక్తికర అప్డేట్ వచ్చింది. ఎంతోకాలంగా అభిమానులు ఎదురుచూస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తయినట్లు తెలుస్తుండటంతో సోషల్ మీడియాలో దీనిపై చర్చ మొదలైంది. షూటింగ్ ముగిసిన సందర్భంగా కంగనా రనౌత్, దర్శకుడు వికాస్ బహల్‌తో కలిసి నిర్వహించిన సెలబ్రేషన్స్‌కు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. ఇటీవల విడుదలైన ‘భారత్ భాగ్య విధాత’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకున్న కంగనా రనౌత్, ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్టులపై పూర్తి దృష్టి పెట్టారు. అందులో అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘క్వీన్ 2’ షూటింగ్ విజయవంతంగా పూర్తయినట్లు సమాచారం. ఈ సందర్భంగా చిత్రబృందం కేక్ కట్ చేసి వేడుకలు కూడా జరుపుకుంది. వైరల్ అవుతున్న వీడియోలో కంగనా దర్శకుడు వికాస్ బహల్‌కు కేక్ తినిపిస్తూ కనిపించడం అభిమానులను ఆకట్టుకుంటోంది.
2013లో విడుదలైన ‘క్వీన్’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించడంతో పాటు, కంగనా నటనకు ప్రశంసలు దక్కాయి. ఒక మామూలు యువతి డేరింగ్ ప్రయాణాన్ని చూపించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలను కూడా అందుకుంది. ఇప్పుడు అదే కథకు కొనసాగింపుగా రూపొందుతున్న ‘క్వీన్ 2’పై కూడా భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ పూర్తయిన నేపథ్యంలో త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. అయితే సినిమా విడుదల తేదీపై చిత్రబృందం ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇండస్ట్రీ వర్గాల అంచనా ప్రకారం ఈ చిత్రం 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ‘క్వీన్ 2’తో పాటు కంగనా రనౌత్ మరో సూపర్ హిట్ ఫ్రాంచైజీ ‘తను వెడ్స్ మను’ మూడో భాగంలో కూడా నటించనున్నట్లు ప్రచారం సాగుతోంది. ఇందులో ఆమె మరోసారి ఆర్. మాధవన్‌తో స్క్రీన్ షేర్ చేసుకోనున్నారని సమాచారం. అయితే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అధికారిక వివరాలు ఇంకా వెలువడలేదు. దీంతో కంగనా అభిమానులు ఆమె రాబోయే రెండు చిత్రాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read
- Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
- Prithvi Weds Akriti: నిశ్చితార్థం రద్దు తర్వాత.. మళ్లీ ఒకటైన పృథ్వీ షా - ఆకృతి.. కారణం చెప్పిన నటి..
- Selma Blair Flight Incident: విమానంలో వీరంగం.. ఇద్దరు ఫ్లైట్ అటెండెంట్లను కొరికిన స్టార్ నటి!
- Vijay Deverakonda: సీఎం విజయ్‌తో విజయ్ దేవరకొండ, రష్మిక భేటీ.. రౌడీ హీరో పోస్ట్ వైరల్!
Kangana from last day of #Queen2 set with Vikas Bahl #KanganaRanaut pic.twitter.com/sY7BE7BIND
— Kangana Updates (@KR_Insta2) June 30, 2026
తాజావార్తలు
-
PM Modi: 21వ శతాబ్దంలో టెక్నాలజీనే శక్తి.. 2014 నుంచి చౌకగా మొబైల్ డేటా లభిస్తుందన్న మోడీ
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!
-
IND vs WI 4th T20: తుది జట్టులో కీలక మార్పులు.. ఆ ఇద్దరికి షాక్.. హైదరాబాద్ టీ20కి భారత్ ప్లేయింగ్ 11 ఇదే!
-
Money Plant Care: మీ ఇంట్లో మనీ ప్లాంట్ ఉందా? ఈ 6 సంకేతాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
-
Who Are Houthis: ఎవరీ హౌతీలు..? సౌదీ అరేబియాపై ఎందుకు దాడి చేస్తున్నారు..? పెట్రోల్ కోసమా..?
ట్రెండింగ్
-
Tea Drinking Mistakes: ‘టీ’ తాగడం ఓకే.. కానీ, తాగే సమయలో ఈ తప్పులు చేసారో.. క్యాన్సర్ వచ్చే ప్రమాదం సుమీ..!
-
Jim Jim Taara Song: “జుమ్ జుమ్ తార” అంటే లోకల్ అనుకుంటివా? ఇంటర్నేషనల్.. మెస్సీ ఫుడ్ బాల్ మ్యాచ్‌లో తెలుగు జానపద సాంగ్!!
-
Electrical Switch Boards Cleaning: జిడ్డుగా మారిన స్విచ్ బోర్డులు ఇలా క్లీన్ చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి..!
-
How To Grow Black Pepper Plant In Pots: మార్కెట్లో మిరియాలు కొనాల్సిన పనిలేదు.. బాల్కనీలోనే ఇలా పెంచండిలా..
-
Vaibhav sooryavanshi: నాలుగో టీ20లో వైభవ్ సూర్యవంశీ..? వైరల్ గా మారిన పోస్ట్.!