Kangana Ranaut Slap News: చండీగఢ్ విమానాశ్రయంలో మధ్యాహ్నం 3:40 గంటలకు కంగనాను CISF కానిస్టేబుల్ కుల్వీందర్ కౌర్ చెంపదెబ్బ కొట్టింది. కంగనా చండీగఢ్ నుంచి ఢిల్లీకి తిరిగి వెళ్తున్నప్పుడు రైతులపై గతంలో కంగనా చేసిన ప్రకటనపై మహిళా కానిస్టేబుల్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. కంగనా రనౌత్ చండీగఢ్ నుండి ముంబైకి షహీద్ భగత్ సింగ్ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి చెక్ ఇన్ చేస్తున్నప్పుడు, అక్కడ సిఐఎస్ఎఫ్‌లో పని చేస్తున్న లేడీ సెక్యూరిటీ సిబ్బంది ఆమెను మేడమ్, మీరు బీజేపీ నుండి గెలిచారా అని అడిగారు. దానికి ఆమె అవునని చెప్పగా రైతుల కోసం మీ పార్టీ ఎందుకు ఏమీ చేయడం లేదు? అని ప్రశ్నించగా దీనిపై చర్చ జరిగింది. ఆ తర్వాత మహిళా సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది చెంప మీద కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికల్లో హిమాచల్ ప్రదేశ్‌లోని మండి స్థానంలో బీజేపీ అభ్యర్థి బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ విజయం సాధించారు.
Rakshana: పాయల్ తో వివాదం ఇదే.. అసలు విషయం ఓపెనైన దర్శక నిర్మాత ప్రణదీప్ ఠాకోర్ ఇంటర్వ్యూ
కంగనా విజయం సాధించగా, కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్ ఓటమి చవిచూడాల్సి వచ్చింది. మండి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి 10 మంది అభ్యర్థులు పోటీ చేశారు. దేశవ్యాప్తంగా అందరి దృష్టి మండి సీటుపై పడింది. కంగనా, విక్రమాదిత్య సింగ్ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి విక్రమాదిత్య సింగ్‌పై 74,755 ఓట్లతో విజయం సాధించారు. కంగనాకు మొత్తం 5,37,022 ఓట్లు వచ్చాయి. ఇక ఈ దాడి అనంతరం కంగనా ఒక వీడియో సందేశాన్ని విడుదల చేస్తూ, హలో ఫ్రెండ్స్, నాకు మీడియా నుండి మరియు నా శ్రేయోభిలాషుల నుండి చాలా కాల్స్ వస్తున్నాయి. అన్నింటిలో మొదటగా నేను సురక్షితంగా ఉన్నా. చండీగఢ్ విమానాశ్రయంలో ఈరోజు ఈ ఘటన జరిగింది. సెక్యురిటీ చెకింగ్ సమయంలో నేను వెళ్లగానే, అవతలి గదిలో నుంచి మహిళా సెక్యూరిటీ గార్డు బయటకు రాగా, ఆమె పక్క నుంచి వచ్చి నా ముఖంపై కొట్టి దుర్భాషలాడింది. ఇలా ఎందుకు చేస్తున్నావని ప్రశ్నించగా.. తాను రైతు ఉద్యమానికి అండగా ఉంటానని చెప్పింది. నేను సురక్షితంగా ఉన్నాను, కానీ పంజాబ్‌లో పెరుగుతున్న ఉగ్రవాదాన్ని ఎలా ఎదుర్కోవాలనేదే నా ఆందోళన.
