బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగా రనౌత్ ప్రేమలో పడింది. త్వరలోనే ఆమె పెళ్లి పీటలు ఎక్కనుందన్న వార్తలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఎప్పుడు వివాదాలను కొనితెచ్చుకొనే పనిలో ఉండే అమ్మడు ఒకప్పుడు హోగా స్టార్ హీరో ప్రేమలో పడినా.. వారిద్దరి మధ్య సాన్నిహిత్యం కుదరక విడిపోయారు. ఇక ఆ తర్వాత ట్విట్టర్ లో తన వాక్చాతుర్యాన్ని చూపిస్తూ వివాదాలకు బ్రాండ్ అంబాసిడర్ గా మారిన అమ్మడు తాజాగా ఒక ఆంగ్ల మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూ లో తన భాగస్వామి గురించి మాట్లాడి ఆశ్చర్యపరిచింది.
తాను త్వరలోనే పెళ్లి చేసుకొని, పిల్లలను కూడా కంటానని చెప్పిన కంగనా ఒక మంచి వ్యక్తితోనే తన వివాహం జరగనున్నట్లు పేర్కొంది. అంతేకాకుండా ఆ మిస్టర్ కంగనా రనౌత్ ని కూడా త్వరలోనే పరిచయం చేస్తానని చెప్పింది. మరి ఈ ఫైర్ బ్రాండ్ మనసును కొల్లగొట్టిన ఆ మిస్టర్ ఫైర్ బ్రాండ్ ఎవరై ఉంటారా అని బాలీవుడ్ లో సెర్చింగ్ మొదలుపెడుతున్నారు నెటిజన్స్.
