Site icon NTV Telugu

Kamal Haasan: ఇండియన్ 2.. సినిమా హిట్ అవ్వకముందే శంకర్ కు గిఫ్ట్ ఇచ్చిన కమల్

Kamal

Kamal

Kamal Haasan: లోక నాయకుడు కమల్ హాసన్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. విక్రమ్ హిట్ తో కమల్ రేంజ్ ఓ రేంజ్ లో మారిపోయింది. ఇక ఈ చిత్రం తరువాత ఒకపక్క నిర్మాతగా ఇంకోపక్క హీరోగా జోరు పెంచేశాడు. ఇక ప్రాజెక్ట్ కె తో విలన్ గా కూడా మారిన కమల్.. ప్రస్తుతం ఇండియన్ 2 సినిమాలో నటిస్తున్నాడు. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. శంకర్- కమల్ కాంబోలో వచ్చిన భారతీయుడు సినిమాకు సీక్వెల్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ నటిస్తుండగా.. రకుల్ ప్రీత్ సింగ్, సిద్దార్థ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక శంకర్ ఇప్పటివరకు పూర్తిచేసిన షూటింగ్ అవుట్ ఫుట్ బాగా వచ్చిందట. అందుకు సంతోషించిన కమల్.. శంకర్ కు కాస్ట్లీ గిఫ్ట్ ను అందించాడు. ఒక కాస్ట్లీ వాచ్ ను ను గిఫ్ట్ గా ఇచ్చి తన సంతోషాన్ని వ్యక్తపరిచాడు. ఈ విషయాన్ని ట్విట్టర్ ద్వారా అభిమానులతో పంచుకున్నాడు.

Neena Gupta: అతడితో లిప్ లాక్.. నోరును డెటాల్ తో కడుక్కున్నా

” ఈరోజు ఇండియన్ 2 లోని మెయిన్ సీన్స్ ను నేను చూసాను. శంకర్ కు బెస్ట్ విషెస్ చెప్తున్నాను. ఇది మాత్రమే మీ శిఖరం కాకుండదని నా సలహా. ఎందుకంటే ఇది మీ కళాత్మక జీవితంలో అత్యున్నత దశ. దీని పైకి తీసుకెళ్లి గర్వపడకండి..మీరింకా పైకి వెళ్ళాలి.” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇక కమల్ గిఫ్ట్ ఇవ్వడంతో ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేసాయి. కొన్ని సీన్స్ కే కమల్ గిఫ్ట్ ఇచ్చాడంటే.. సినిమా ఏ రేంజ్ లో ఉండి ఉంటుందో అని అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు. మరి ఈ సినిమాతో ఈ కాంబో ఎలాంటి హిట్ అందుకుంటుందో చూడాలి.

Exit mobile version