NTV Telugu Site icon

Kamal Haasan : కమల్ హాసన్ అందరి ముందే నన్ను తిట్టాడు.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్..

Poonam

Poonam

Kamal Haasan : కమల్ హాసన్ సినిమాల పట్ల ఎంత పట్టుదలతో ఉంటారంటే తెలిసిందే. అలాంటి కమల్ హాసన్ ఇప్పటికీ సినిమాల కోసం ఎంతో కష్టపడుతుంటారు. లన లుక్ ను ఎలా అంటే అలా మార్చేసుకుంటారు. అందుకే ఆయన్ను విశ్వనటుడు అంటారు. అయితే ఓ స్టార్ హీరోయిన్ మాత్రం తనను కమల్ హాసన్ అందరి ముందే తిట్టేశాడు అని చెప్పుకొచ్చింది. ఆమె ఎవరో కాదు పూనమ్ ధిల్లాన్. ఈమె బాలీవుడ్ తో పాటు సౌత్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది. అయితే కమల్ హాసన్ తో ఓ సినిమా చేసేటప్పుడు ఆమె ఆలస్యంగా వెళ్తే కమల్ సీరియస్ అయ్యాడంట.

Read Also : Chirag Paswan: వీధుల్లో నమాజ్ చేయడంపై కేంద్రమంత్రి కీలక వ్యాఖ్యలు

‘బాలీవుడ్ లో గంట లేటుగా వెళ్లినా సరే ఎవరూ ఏమీ అనరు. మేం అలాగే అలవాటు అయి ఉన్నాం. అందుకే కమల్ హాసన్ తో సినిమాకు ఓ రోజు నేను గంట లేటుగా వెళ్లాను. కానీ నాకు ఎలాంటి పశ్చాత్తాపం లేదు. కామన్ గానే ఉన్నాను. కానీ అందరూ సెట్స్ లో నన్ను సీరియస్ గా చూస్తున్నారు. కమల్ హాసన్ వచ్చి.. నువ్వు ఎందుకు ఇంత లేటుగా వచ్చావ్ పూనమ్. లైట్ బాయ్, కెమెరా బాయ్స్ ఉదయం 5గంటలకే వచ్చారు. వారంతా నీ కోసం గంట నుంచి ఎదురు చూస్తున్నారు. వాళ్లు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఆలోచించు అంటూ స్వీట్ గా వార్నింగ్ ఇచ్చారు. అప్పుడే నాకు నా తప్పు తెలిసింది. అందరికీ సారీ చెప్పాను. అప్పటి నుంచి సెట్స్ కు లేటుగా వెళ్లట్లేదు’ అంటూ చెప్పుకొచ్చింది పూనమ్.