Site icon NTV Telugu

Indian 2: సెట్ లోకి ‘సేనాపతి’ అడుగు పెట్టిన వేళ..

Kamal

Kamal

Indian 2: ఎన్నో ఆటంకాలు.. మరెన్నో వివాదాలు.. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టి ఇండియన్ 2 సెట్ లో అడుగుపెట్టాడు కమల్ హాసన్. భారతీయుడు సినిమాతో ఇండస్ట్రీని షేక్ చేసిన కాంబో శంకర్- కమల్ హాసన్. మళ్లీ ఇన్నాళ్ల తరువాత ఈ కాంబో.. ఇండియన్ 2 తో ప్రేక్షకుల ముందుకు రానుంది,. ఇక ఇండియన్ 2 మొదలుపెట్టిన దగ్గరనుంచి ఏదో ఒక వివాదం.. అసలు ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కుతుందా..? అన్న అనుమానం కూడా అభిమానులకు వచ్చింది అంటే అతిశయోక్తి కాదు. ఇక ఎట్టకేలకు ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. లైకా ప్రొడక్షన్స్ తో పాటు రెడ్ జైంట్ మూవీస్ ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాయి.

ఇక తాజాగా ఈ సినిమా సెట్ లో అడుగుపెట్టాడు కమల్ హాసన్. నేటి నుంచి కమల్ పై కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారట. ఇక ఈ సినిమాలో కమల్ సరసన కాజల్ అగర్వాల్, రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తున్నారు. ఇప్పటికే రకుల్ తన పాత్ర షూటింగ్ ను పూర్తి చేయగా.. కాజల్ త్వరలోనే సెట్స్ లో అడుగుపెట్టనుంది. ఇక ఈ సెట్ లో సేనాపతి లుక్ ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. విక్రమ్ లో అల్ట్రా స్టైలిష్ లుక్ లో కనిపించిన కమల్.. ఈ సినిమాలో తన ఒరిజినల్ లుక్ తో కనిపించనున్నాడు. వైట్ అండ్ బ్లాక్ హెయిర్, పెద్ద పెద్ద మీసాలతో సేనాపతి అదరగొట్టేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. మరి ఈ సినిమా పూర్తయ్యి, రిలీజ్ అయ్యేది ఎప్పుడో చూడాలి.

Exit mobile version