Kamal Hasan : కమల్ హాసన్ వరుస ప్రమోషన్లతో ఫుల్ బిజీగా ఉంటున్నాడు. ఆయన నటించిన థగ్ లైఫ్ జూన్ 5న రిలీజ్ కాబోతోంది. ఇందులో శింబు, త్రిష కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మణిరత్నం డైరెక్షన్ లో వస్తుండటంతో అంచనాలు బాగానే ఉన్నాయి. ఇప్పటికే ప్రీ రిలీజ్ ఈవెంట్లు ఊడా నిర్వహిస్తున్నారు. తాజాగా కమల్ హాసన్ ప్రమోషన్లలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో కీలక విషయాలను వెల్లడించారు కమల్. ఆయన మాట్లాడుతూ.. థగ్ లైఫ్ ను ఒక భావోద్వేగ పరిస్థితుల ఆధారంగా తీశామన్నారు. ఇప్పటి వరకు తమ టీమ్ చాలా కష్టపడిందని.. ఈ మూవీ హిట్ అయితే చూడాలని ఉందంటూ చెప్పుకొచ్చారు కమల్.
Read Also : 3 Roses : ‘3 రోజెస్’ సీజన్ 2 టీజర్ రిలీజ్.. అదరగొట్టిన సత్య..
ప్రస్తుతం ఆపరేషన్ సిందూర్ జరుగుతోంది. ఓ వైపు దేశ వ్యాప్తంగా ఆందోళన కర పరిస్థితులు ఉంటే మనం సెలబ్రేషన్స్ చేసుకోవడం కరెక్ట్ కాదు. అందుకే మా సినిమా ఈవెంట్లు చాలా వరకు వాయిదా వేసుకున్నాం. ఇప్పటికీ థగ్ లైఫ్ ఈవెంట్లు అనుకున్న స్థాయిలో చేయట్లేదు. త్వరలోనే పహల్గాంకు వెళ్తాను. అక్కడ టూరిజాన్ని పెంచడం మన బాధ్యత.
అది కూడా నా దేశంలో భాగమే. కాబట్టి అక్కడకు వెళ్లి టూరిస్టులకు ధైర్యం చెబుతాను. దేశంలోని అన్ని ప్రాంతాలు మనవే. కాబట్టి దేశంలో ఎక్కడ ఏం జరిగినా నాకు కచ్చితంగా బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యత ప్రకారమే నేను ఇప్పటి వరకు నడుచుకుంటున్నాను. థగ్ లైఫ్ అందరికీ నచ్చేలా ఉంటుందనే నమ్మకంతోనే తీశాం’ అంటూ తెలిపాడు కమల్ హాసన్.
Read Also : Aamir Khan : ‘సితారే జమీన్ పర్’ పై అమిర్ ఖాన్ సంచలన నిర్ణయం..
