Site icon NTV Telugu

Vikram: ‘విక్రమ్’ హిట్.. డైరెక్టర్ కు కాస్ట్లీ గిఫ్ట్ ఇచ్చిన కమల్

Vikram

Vikram

విశ్వనటుడు కమల్ హాసన్ ఎట్టకేలకు విక్రమ్ సినిమాతో హిట్ అందుకున్నాడు. కొన్నేళ్లుగా తెరపై కనిపించకపోయినా, ప్లాప్ సినిమాలు వెక్కిరిస్తున్నా.. వేటికి జంకకుండా కుర్ర డైరెక్టర్ లోకేష్ ను లైన్లో పెట్టి కష్టపడి విక్రమ్ ను తెరకెక్కించాడు కమల్.. లోకేష్ కనగరాజ్ మొదటి నుంచి కమల్ ఫ్యాన్ అవ్వడంతో తన అభిమానాన్ని మొత్తం ఈ సినిమాలో చూపించేశాడు. స్టార్ హీరోలు ఫహద్ ఫాజిల్, విజయ్ సేతుపతి, సూర్య లాంటి స్టార్ క్యాస్టింగ్ ను తీసుకొని ఎక్కడా ఒకరిని ఎక్కువ ఒకరిని తక్కువ చేయకుండా లోకేష్ చూపించిన విధానం ప్రేక్షకులను కట్టిపడేసింది. ఇక విశ్వనటుడు కమల్ తన విశ్వరూపాన్ని చూపించేశాడు. దీంతో ఈ సినిమా మూడు రోజులకే రూ. 100 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యింది.

ఇక తాజాగా ఇంతటి హిట్ ను తనకు అందించినందుకు డైరెక్టర్ లోకేష్ కు కమల్ కాస్ట్లీ బహుమతిని అందించాడు.. లగ్జరీ కారును బహుమతిగా ఇచ్చాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారాయి. ఈ కారు విలువ సుమారు రూ.2.5 కోట్లు ఉంటుందని తెలుస్తుంది. ఇక ఈ కారుతో పాటు ఒక ఎమోషనల్ లెటర్ కూడా కమల్, లోకేష్ కు అందించాడు. ఆ లెటర్ ను లోకేష్ సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు. ” లైఫ్ టైమ్ సెటిల్ మెంట్ లెటర్.. ఈ లెటర్ చదువుతున్నప్పుడు నాకు వచ్చిన ఫీలింగ్స్ ను చెప్పడానికి మాటలు రావడం లేదు.. ధన్యవాదాలు కమల్ హాసన్ సర్” అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారాయి.

Exit mobile version