Site icon NTV Telugu

కమల్ సినిమా షూటింగ్ కు అడ్డంకులు… రాజకీయాలే కారణమా?

Vikram

Vikram

సౌత్ సూపర్ స్టార్ కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విక్రమ్’. ఈ చిత్రంలో కమల్ హాసన్‌తో పాటు విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు. ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి ఇద్దరూ విలన్‌గా కనిపిస్తారని అంటున్నారు.

Read Also : నాగశౌర్య ఫామ్ హౌజ్ లో జూదం… రిమాండ్ కు తరలింపు

ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా లొకేషన్‌లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు మేకర్స్. ‘విక్రమ్‌’ చిత్రానికి సంబంధించి కరైకుడి, పాండిచ్చేరిలో ఇప్పటికే రెండు షెడ్యూల్స్‌ పూర్తయ్యాయి. కమల్ హాసన్ బ్యానర్ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పై తెరకెక్కుతున్న ఈ సినిమా తాజా షెడ్యూల్ ను తమిళనాడు పోలీస్ మ్యూజియంలో జరపాలనుకున్నారు. దీని కోసం అక్టోబర్ 24-25 తేదీలలో సెట్ వర్క్‌కు అనుమతి కూడా దొరికిందని అన్నారు. దీని కోసమే అక్టోబర్ 27-28 తేదీలను ఖరారు చేసినట్లు వార్తలు వచ్చాయి. కానీ తాజా ప్రకారం మహమ్మారి ఆంక్షలను పేర్కొంటూ చెన్నై పోలీసులు ‘విక్రమ్’ బృందానికి అనుమతి నిరాకరించారు. దీంతో దర్శకుడు లోకేష్ కనగరాజ్ షూటింగ్ వాయిదా వేసి ప్రత్యామ్నాయ లొకేషన్ కోసం అన్వేషణ మొదలుపెట్టారు. అయితే ముందుగా సినిమా షూటింగ్ కు అనుమతిని ఇచ్చి, తరువాత నిరాకరించడం, పైగా కోవిడ్ నిబంధనలను సాకుగా చుపించారంటూ జరుగుతున్న ప్రచారం సరికొత్త అనుమానాలకు తావిస్తోంది.

రాజకీయాలే కారణమా?
ఈ ఏడాది మేలో తమిళనాడులో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కమల్ హాసన్ చురుగ్గా పాల్గొని అప్పటి డీఎంకే ప్రభుత్వంపై పోటీ చేశారు. కమల్ హాసన్ “మక్కల్ నిధి మయ్యమ్” అనే పార్టీని స్థాపించి తన అభ్యర్థిని నిలబెట్టారు. ఆయన స్వయంగా కోయంబత్తూరు నుండి పోటీ చేసాడు. కానీ అక్కడ అతను ఓటమిని ఎదుర్కోవలసి వచ్చింది.అందుకే ఇప్పుడు కమల్ హాసన్‌ను ప్రతిపక్షంగా భావించి ఆయన పనికి డీఎంకే ప్రభుత్వం అడ్డుపడుతోందని అంటున్నారు ఆయన అభిమానులు.

Exit mobile version