NTV Telugu Site icon

Kamakshi Bhaskarla : ఆ స్టార్ హీరో సినిమాలో బంపర్ ఆఫర్ కొట్టేసిన పొలిమేర బ్యూటీ..?

Whatsapp Image 2023 11 04 At 8.56.08 Pm

Whatsapp Image 2023 11 04 At 8.56.08 Pm

చిత్ర పరిశ్రమ లో ఎంతో మంది హీరో హీరోయిన్ లు గా మారి వరుసగా సినిమాలు చేస్తూ వాళ్ళకంటు ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను గుర్తింపును సంపాదించుకుంటున్నారు. ఇక ఇలాంటి క్రమంలో రీసెంట్ గా చాలామంది కమెడియన్లు హీరోలుగా మారిపోతున్నారు.ప్రస్తుతం వైవా హర్ష కూడా సుందరం మాస్టారు అనే సినిమాతో ఇండస్ట్రీకి హీరోగా పరిచయం కాబోతున్నాడు. ఇలాంటి సమయంలో కమెడియన్లు కూడా హీరోలుగా చేస్తూ తమకంటూ ప్రత్యేక గుర్తింపు ను తెచ్చు కుంటున్నారు. ఇక ఇది ఇలా ఉంటే రీసెంట్ గా రిలీజ్ అయిన పొలిమేర 2 అనే సినిమా మంచి విజయాన్ని సాధించే దిశగా అద్భుతమైన టాక్ తో దూసుకెళ్తుంది..గతంలో ఓటీటీ లో సూపర్ హిట్ అయిన పొలిమేర సినిమాకి ఈ సినిమా కొనసాగింపుగా వచ్చింది.. అయితే సీక్వెల్ గా వచ్చిన ఈ సినిమాను ఈ సారి చిత్ర యూనిట్ థియేటర్స్ లో విడుదల చేసారు.ఇక ఈ సినిమాలో కమెడియన్ సత్యం రాజేష్ ప్రధాన పాత్ర పోషించాడు..అలాగే ఫిమేల్ లీడ్ రోల్ లో నటించిన కామాక్షి భాస్కర్ల ఈ చిత్రంతో ఎంతో ఫేమస్ అయ్యింది.

ఈ సినిమా లో ఆమె నటన అద్భుతంగా ఉంది. ఇక దానికి తోడుగా ఆమె తెలుగు నటి కావడం కూడా ఆమెకు బాగా కలిసి వచ్చే అంశంగా చెప్పొచ్చు… ప్రస్తుతం ఆమె వరుస సినిమాలు చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది ఇప్పటికే ఆమె పొలిమేర 2 సినిమాలో అద్భుతంగా నటించి నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది.ఇక ప్రస్తుతం ఆమెకు స్టార్ హీరోల సినిమాల్లో మంచి ఆఫర్స్ వస్తున్నట్లుగా తెలుస్తుంది. అందులో భాగంగానే మెగాస్టార్ చిరంజీవి వశిష్ఠ కాంబో లో వచ్చే సినిమా లో కామాక్షి భాస్కర్ల ను ఒక కీలక పాత్ర కోసం తీసుకోబోతున్నట్లు గా తెలుస్తుంది…అయితే చిత్ర యూనిట్ నుంచి అధికారిక ప్రకటన రాలేదు.. అయితే ఈ వార్త కనుక నిజమైతే కామాక్షి టాలీవుడ్ లో బిజీ ఆర్టిస్ట్ గా మారడం ఖాయమని చెప్పొచ్చు..