Site icon NTV Telugu

Kalyani Priyadarshan : నేను ఏ అనాధాశ్రమంలోను గడపలేదు.. తప్పుడు ప్రచారాలు ఆపండి

Kalyani Priyadarshi

Kalyani Priyadarshi

ఈ మధ్య కాలంలో ఎలాంటి సినిమాలు హిట్ అవుతున్నాయో.. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఆదరిస్తారో అంచనా వేయడం కష్టం అయింది. దీనికి నిదర్శనం తాజాగా విడుదలైన ‘కొత్త లోక’. రూ.270 కోట్లకు పైగా వసూలు చేసి రికార్డులు క్రియేట్ చేసింది. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ చిత్రం భాషతో సంబంధం లేకుండా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ముఖ్యంగా ఇందులో సూపర్ ఉమెన్ అనిపించుకుంది మలయాళ బ్యూటీ కళ్యాణి ప్రియదర్శన్ తనలోని కొత్త కోణాలు చూపించింది. దీంతో కళ్యాణి కెరీర్ కి ఈ మూవీ మైలురాయిగా నిలిచిందనడంలో సందేహం లేదు. అయితే..

Also Read : Saiyaara: ‘సైయారా’ హిట్‌ తో 200 మంది కష్టం వృధా – అనుపమ్ ఖేర్‌

హీరోయిన్‌ల వ్యక్తిగత విషయాల పై తప్పుడు ప్రచారాలు జరగటం కొత్తెమి కాదు. రోజుకొకటి పుట్టుకొస్తున్న ఉంటాయి. ఇందులో భాగంగా ‘కళ్యాణి ప్రియదర్శన్ తల్లిదండ్రులు తనను, తన బ్రదర్‌ను అనాథాశ్రమంలో ఉంచారని, అక్కడ అనాథ పిల్లలతో కలిసి తినడం, నేలపైనే పడుకోవడం, అలా చేయడం వలన జీవితం విలువ ఏంటో తెలుస్తుందని..’ కళ్యాణ్ చెప్పినట్లుగా కొన్ని వెబ్‌సైట్లలో వార్తలొచ్చాయి. నిజ నిజాలు తెలుసుకొకుండా ఆ వార్తని చాలా వెబ్‌సైట్‌లు రాశాయట. అయితే తాజాగా ఆ ప్రచారంపై కళ్యాణి స్పందిస్తూ.. ‘నేనెప్పుడూ అలా చెప్పలేదు, నేను ఎలాంటి ఆశ్రమంలో గడపలేదు. దయచేసి ఇలాంటి అసత్య ప్రచారాలు ఆపండి. నేను అనని మాటల్ని అలా రాయడం సరికాదు.. దయచేసి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి’ అని ఆమె కోరారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ అవుతుంది.

Exit mobile version