Site icon NTV Telugu

Kalyanram : ‘ముచ్చటగా బంధాలే’.. కల్యాణ్‌ రామ్, విజయశాంతి మధ్య సాంగ్ వచ్చేసింది..

Kalyan Ram

Kalyan Ram

Kalyanram : నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ సన్నాఫ్ వైజయంతి. ఇందులో విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇందులో వీరిద్దరూ తల్లి, కొడుకులుగా కనిపిస్తున్న సంగతి తెలిసిందే. సాయి మంజ్రేకర్ హీరోయిన్. కొత్త డైరెక్టర్ ప్రదీప్ చిలుకూరి డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమా నుంచి తాజాగా సాంగ్ రిలీజ్ చేశారు. ముచ్చటగా బంధాలే అంటూ తల్లి, కొడుకుల మధ్య ప్రేమను చూపిస్తూ ఆ సాంగ్ ఉంది. ఇందులో తల్లిని హీరో ఎంత బాగా చూసుకుంటాడు అనేది చూపించారు. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ఉన్న వైజయంతికి కొడుకు ఇంట్లో పనులు, సేవలు చేస్తూ ఉండటం ఇందులో మనకు కనిపిస్తోంది. సెట్స్ అన్నీ రిచ్ గానే కనిపిస్తున్నాయి. విజువల్స్ కూడా చాలా స్టైలిష్ గా తీర్చిదిద్దారు.

Read Also : HIT-3 : హిట్-3 నుంచి మాస్ సాంగ్.. ట్రైలర్ డేట్ వచ్చేసింది..

అజనీష్‌ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తుండగా.. హరిచరణ్‌ ఈ సాంగ్ పాడారు. రఘురామ్ లిరిక్స్ రాశారు. ఈ నెల 18న వస్తున్న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. కల్యాణ్‌ రామ్ కు హిట్ పడి చాలా రోజులు అవుతోంది. ఈ సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నారు. చాలా ఏళ్ల తర్వాత విజయశాంతి మళ్లీ సినిమాలో కనిపిస్తోంది. దీంతో మూవీపై మంచి హైప్ వచ్చేసింది. త్వరలోనే ట్రైలర్ ను రిలీజ్ చేయబోతున్నారు. ఈ సాంగ్ ను చిత్తూరులో రిలీజ్ చేశారు. కల్యాణ్‌ రామ్ వస్తుండటంతో పెద్ద ఎత్తున అభిమానులు అక్కడకు చేరుకున్నారు. ఎన్టీఆర్, కల్యాణ్‌ రామ్ ఫ్లెక్సీలతో నింపేశారు. అభిమానుల మధ్య ఈ సాంగ్ రిలీజ్ చేసింది మూవీటీమ్.

Exit mobile version