Site icon NTV Telugu

Kalyan Ram: హిందీలో కూడా డెవిల్… నందమూరి హీరో పాన్ ఇండియా రిలీజ్

Devil Glimpse Out Now

Devil Glimpse Out Now

‘బింబిసార’ సినిమాతో డబుల్ బ్లాక్ బస్టర్ కొట్టిన నందమూరి కళ్యాణ్ రామ్, ఈసారి పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేస్తున్నాడు. అభిషేక్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘డెవిల్’ సినిమాలో కళ్యాణ్ రామ్ ‘బ్రిటిష్ స్పై’గా నటిస్తున్నాడు. కళ్యాణ్ రామ్ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్న ఈ మూవీ పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతోంది. ఒక్క లీకు కూడా లేకుండా పెద్దగా హడావుడి చెయ్యకుండా సైలెంట్ గా ‘డెవిల్’ షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. నవీన్ మేడారం డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా గ్లిమ్ప్స్ ఇటీవలే బయటకి వచ్చింది. ఈ గ్లిమ్ప్స్ లో చూపించిన విజువల్స్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి, కళ్యాణ్ రామ్ కూడా కొత్తగా కనిపించాడు.

Read Also: Rajinikanth: ఓ జైలరూ… ఇక్కడ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టు

పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ తో, థ్రిల్లింగ్ స్పై జానర్ లో సినిమా అంటే పాన్ ఇండియా ఆడియన్స్ కి రీచ్ అవ్వడం పెద్ద కష్టమేమీ కాదు. అందుకే మేకర్స్ డెవిల్ సినిమాని హిందీలో కూడా రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. బీ4యూ మోషన్ పిక్చర్స్ డెవిల్ సినిమాని హిందీలో రిలీజ్ చేస్తున్నారు. డెవిల్ గ్లిమ్ప్స్ ని హిందీలో రిలీజ్ చేస్తూ మేకర్స్ ఈ అనౌన్స్మెంట్ ఇచ్చారు. బింబిసారా సినిమాతోనే పాన్ ఇండియా మార్కెట్ ని టార్గెట్ చేయాల్సిన కళ్యాణ్ రామ్, ఆ టైమ్ లో మిస్ అయ్యాడు కానీ ఈసారి మాత్రం డెవిల్ తో ఆ టార్గెట్ మిస్ అయ్యేలా కనిపించట్లేదు. ఇక బింబిసార కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ సంయుక్త మీనన్ హీరోయిన్ డెవిల్ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరి కళ్యాణ్ రామ్ కెరీర్ లోనే భారి బడ్జట్ తో రూపొందుతున్న ‘డెవిల్’ సినిమా పాన్ ఇండియా ఆడియన్స్ ని ఎంతవరకు అట్రాక్ట్ చేస్తుంది అనేది చూడాలి.

Exit mobile version