Kalpana Daughter Sree Mayee Kumar Looking Like heroine: నటి కల్పన సౌత్ సినీ పరిశ్రమలో అత్యంత ప్రజాదరణ పొందిన నటి. చిన్నప్పటి నుంచి మలయాళంలో నటించడం ప్రారంభించిన ఆమె తమిళ సినిమా చిన్న వీడుతో తెరంగేట్రం చేశారు. నిజానికి ఆమె నటి ఊర్వశి సోదరి . నటి కల్పన 1998లో అనీల్ కుమార్‌ను వివాహం చేసుకున్నారు. ఈ దంపతులకు ఒక కుమార్తె ఉంది. 300కు పైగా చిత్రాల్లో నటించిన నటి కల్పన జాతీయ అవార్డును గెలుచుకున్నారు. నిజానికి ఆమె హైదరాబాదులోనే కన్నుమూశారు. నాగార్జున, కార్తి హీరోలుగా తెరకెక్కిన తెలుగు, తమిళం ద్విభాషా చిత్రం ‘ఊపిరి’ షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చారు. ఈ చిత్రంలో ఆమె నాగార్జున ఇంట్లో కేర్ టేకర్ పాత్రలో నటించింది.
Jaya Jaya He Telangana: తెలంగాణ రాష్ట్ర గీతానికి ఆస్కార్ గ్రహీత సంగీతం!
షూటింగ్ అనంతరం ఆమె ఓ హోటల్ లో బస చేయగా అపస్మారక స్థితిలో ఉండడాన్ని గుర్తించి వెంటనే అపోలో ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మరణించినట్లు వైద్యులు తెలిపారు. కల్పన పూర్తి పేరు కల్పన రంజిని. ఆమె నటించిన ఎన్నో సినిమాలు తెలుగులో కూడా అనువాదం అయ్యాయి. 2012లో ఆమె ఉత్తమ సహాయ నటిగా జాతీయ అవార్డు అందుకున్నారు. ఇక తాజాగా దివంగత నటి కల్పన కూతురు శ్రీమయి కుమార్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో షేర్ చేశారు. తాజాగా శ్రీమయి తన ఇన్‌స్టాగ్రామ్ పేజీలో ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫొటోలలో ఆమె హీరోయిన్స్ ను మించిన అందంతో కనిపిస్తోంది. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.