NTV Telugu Site icon

Kalki 2898 AD: రికార్డ్ వ్యూస్ తో దోసుకుపోతున్న “కల్కి” ఫ్యాన్ మేడ్ సాంగ్

Prabhas Kalki

Prabhas Kalki

గ్లోబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కించిన మూవీ “కల్కి 2898 ఏడి” బాలీవుడ్ స్టార్ హీరో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొణె మరియు దిశా పటానీ ప్రధాన పాత్రలో నటించారు. పురాణాలను సైన్స్ ఫిక్షన్‌తో ముడిపెడుతూ తెరకెక్కించిన ఈ మూవీకి ప్రేక్షకులు బ్రహ్మారథం పట్టారు. 600 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ మూవీ జూన్ 27 విడుదలై తొలి రోజే రూ. 191 కోట్లకు పైగా కొల్లగొట్టింది. రిలీజ్ అయినా నాలుగు రోజుల్లో రూ. 555 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి ఎన్నో రికార్డ్స్ తన పేరున నమోదు చేసింది. ఇక వారం గడిచేలోగా రూ.700కోట్లకు పైగా వసూలు చేసింది. రెండు వారాలు గడవకుండానే ఈ మూవీ 1000కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. అయిన కానీ కలెక్షన్ల జోరు ఏ మాత్రం తగ్గలేదు. ఇప్పటివరకు 1250 కోట్లు కలెక్ట్ చేసిన ఈ సినిమా 1300 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది.

Also Read: KGF : త్వరలోనే సెట్స్ పైకి KGF -3.. హీరో ఎవరంటే..?

ఇప్పటికే ఎన్నో రికార్డులు సృష్టించిన కల్కి తాజాగా మరో రికార్డు కూడా తన పేరు మీద నమోదు చేసుకుంది. కల్కి సినిమా రిలీజ్ అయిన తరువాత ప్రభాస్ ఫాన్స్ కొంతమంది “కల్కి” ఫ్యాన్ మేడ్ సాంగ్ కంపోజ్ చేసారు. ఓరిజినల్ సాంగ్స్ కంటే ఈ ఫ్యాన్ మేడ్ సాంగ్ కు ప్రేక్షకులు దగ్గర నుంచి విపరీతమైన స్పందన లభించింది. దీనితో కొంతమంది యూటుబ్ర్స్ వాళ్ళ ట్యాలెంటెతో ఈ సాంగ్ కి వీడియో కంపోజ్ చేసారు. మూవీలో కొన్ని పోస్టర్స్ తో లిరిక్స్ సాంగ్ గ ఒక వీడియో సాంగ్ కంపోజ్ చేసారు. సాంగ్ బాగా రావడంతో యూట్యూబ్ లో అప్లోడ్ చేసారు. ఇక అప్లోడ్ చేసిన 24 గంటల్లోనే లక్ష వ్యూస్ తో సెన్సేషన్ క్రేయేట్ చేసింది. ఒక ఫ్యాన్ మేడ్ సాంగ్ కి ఇంతలా పాపులారిటీ రావడం గమనార్హం. పోను పోను ఈ సాంగ్ సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది.

Show comments