Kalki 2898AD: మెగాస్టార్ చిరంజీవి నేడు తన 68 వ పుట్టినరోజును జరుపుకుంటున్న విషయం తెల్సిందే. కొణిదెల శివశంకర్ వరప్రసాద్ నుంచి మెగాస్టార్ గా మారిన చిరు ప్రయాణం ఎంతోమందికి ఆదర్శప్రాయం. ఇండస్ట్రీకి వచ్చే ప్రతి ఒక్క నటుడు చెప్పే ఒకే విషయం .. చిరంజీవిని చూసే నేను హీరో అవ్వాలనుకున్నాను అని.. ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చే హీరోలకు చిరునే ఆదర్శం. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో ఆయనే మెగాస్టార్. చిరు చెప్పుకున్నా.. చెప్పుకోకపోయినా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు కూడా ఆయనే. సినిమా చిన్నది పెద్దది అని లేకుండా.. హీరో మనవాడు.. పొరుగు రాష్ట్రము వాడు అనే తేడా చూపకుండా కథ బావుంటే.. ప్రేక్షకులు మెచ్చుతారు అనుకుంటే.. వారికి సపోర్ట్ చేయడంలో ఎప్పుడు వెనుకాడడు. ఇక సేవా కార్యక్రమాలు.. చిరును చిరకాలం జీవించేలా చేస్తాయి. కష్టం అని వినిపడడం ఆలస్యం నేను ఉన్నా అంటూ చేయూతను అందిస్తాడు. అలాంటి చిరు పుట్టినరోజు అంటే.. టాలీవుడ్ కు పండుగ రోజు అని చెప్పాలి.
Mahesh Babu: చొక్కా సింపుల్ గా ఉందని తక్కువ రేటు అనుకునేరు.. మన ఒక నెల జీతం
ఇక ఈరోజు కోసం అభిమానులు ఏడాది మొత్తం ఎదురుచూస్తారు. రక్తదానాలు, పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, అన్నదానాలు.. ఇలా ఒకటి అని లేకుండా చిరు బర్త్ డే ను పండగలా చేస్తారు. ఇంకోపక్క సోషల్ మీడియాలో సినీ, రాజకీయ ప్రముఖులు చిరుకు బర్త్ డే విషెస్ చెప్తూ వారి ప్రేమను చూపిస్తూ ఉంటారు. ఉదయం నుంచి చిరు బర్త్ డే విషెస్ తో సోషల్ మీడియా షేక్ అవుతోంది. తాజాగా కల్కి 2898AD చిత్రబృందం సైతం మెగాస్టార్ కు స్పెషల్ బర్త్ డే విషెస్ ను తెలిపింది. ప్రభాస్, దీపికా పదుకొనే జంటగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కల్కి 2898AD. వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక నేడు చిరు బర్త్ డే కావడంతో కల్కి టీమ్.. స్పెషల్ గా చిరును విష్ చేసింది. గ్యాంగ్ లీడర్ లో చిరు.. వెల్డింగ్ స్పెక్ట్స్ పెట్టుకొని మంటను రగిలిస్తున్నట్లు ఉండే ఫోటో ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక అదే ఫోజ్ ను ప్రభాస్ ఇమిటేట్ చేశాడు. కళ్లకు వెరైటీ కళ్లజోడు పెట్టుకొని.. చేతిలో వెల్డింగ్ గన్ ను పట్టుకొని అచ్చు చిరులా చేసి షాక్ ఇచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ వీడియో పోస్ట్ చేస్తూ ఇన్స్ పైరెడ్ బై చిరు లీక్స్ అని చెప్పుకొచ్చారు. అంటే కల్కి సినిమాలో ప్రభాస్ చేసిన షాట్ ను.. చిరు ఫోజ్ కు పోలుస్తూ వైజయంతీ మూవీస్ ఇలా బర్త్ డే విషెస్ తెలిపిందన్నమాట. ఏదిఏమైనా చిరు లా ప్రభాస్ మాత్రం అదిరిపోయాడని చెప్పాలి. మరి ఈ వీడియోపై చిరు ఎలా స్పందిస్తాడో చూడాలి.
Straight from the hearts and the editing room of #Kalki2898AD 👀
Here’s wishing our Megastar @KChiruTweets garu an extraordinary birthday!
Inspired by #ChiruLeaks 😉 pic.twitter.com/uFrJp8Rx9T
— Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 22, 2023