‘రెబల్ స్టార్’ ప్రభాస్ లైనప్‌లో ఉన్న సినిమాల్లో మోస్ట్ అవైటేడ్ సీక్వెల్ ‘కల్కి 2’ కూడా ఒకటి. ఈసారి ప్రభాస్ క్యారెక్టర్ అంతకుమించి ఉంటుందని పార్ట్ వన్ రిలీజ్ సమయంలోనే చెప్పేశాడు దర్శకుడు నాగ్ అశ్విన్. అయితే ప్రభాస్ ఇతర కమిట్మెంట్స్ కారణంగా ఈ సినిమా ఇంకా పట్టాలెక్కలేదు. కానీ ఇప్పుడు డార్లింగ్ ఈ సినిమాకు డేట్స్ ఇచ్చేశాడు. ఫిబ్రవరిలోనే షూటింగ్ మొదలు కానుంది. సమ్మర్‌లో ప్రభాస్ సెట్స్‌లో అడుగుపెట్టనున్నాడు. ముందుగా కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ లాంటి స్టార్స్‌తో కీలక సన్నివేశాలు తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు మేకర్స్.
Also Read: Dhulipalla Narendra Kumar: అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చా.. ఉచిత వైద్యానికి నేను వ్యతిరేకం!
అయితే తాజాగా కల్కి 2 సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు. ఆయన ఓ ఇంటర్య్వూలో కల్కి 2 గురించి మాట్లాడుతూ.. ‘కల్కి 2 నా కెరీర్‌లోనే టాప్ మూవీ ఉండబోతుంది. ఈ సినిమా కోసం నేను అందించబోయే సంగీతం చాలా అద్భుతంగా ఉంటుందది. అందుకోసం మా టీమ్ చాలా కష్టపడుతుంది. మేము ఇప్పటికే కల్కి పార్ట్-2 కోసం పని చేయడం ప్రారంభించాము’ అని చెప్పారు. అలాగే త్వరలోనే షూటింగ్ ప్రారంభమవుతుందని తెలిపారు. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కల్కి సినిమాకు సంతోష్ నారాయణన్ అందించిన మ్యూజిక్ అదిరిపోయింది. ఇప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం.. కల్కి 2 సౌండ్ మామూలుగా ఉండదనే చెప్పాలి. ఈ సినిమా నుంచి దీపిక పదుకొనేని తప్పించిన సంగతి తెలిసిందే. ఆమె ప్లేస్‌లో ఎవరిని తీసుకుంటున్నారనే విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. మరి ఈసారి నాగ్ అశ్విన్ ఎలా ప్లాన్ చేస్తున్నాడో చూడాలి.
